Wednesday, April 1, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా టెక్‌ కంపెనీలపై ఇరాన్‌ గురి

అమెరికా టెక్‌ కంపెనీలపై ఇరాన్‌ గురి

- Advertisement -

జాబితాలో ఆపిల్‌, గూగుల్‌తో సహా 18 సంస్థలు
నేటి నుంచి దాడులు : ఐఆర్‌జీసీ

టెహ్రాన్‌ : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు కొత్త మలుపు తిరిగాయి. క్షిపణులు, డ్రోన్లను దాటి ఇప్పుడు టెక్నాలజీ కంపెనీలు లక్ష్యంగా మారాయి. ఈ క్రమంలోనే ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ అమెరికా టెక్‌ కంపెనీలకు నేరుగా హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వ మీడియా నివేదికల ప్రకారం ఐఆర్‌జీసీ 18 ప్రధాన కంపెనీలను సంభావ్య లక్ష్యాలుగా గుర్తించి జాబితాను విడుదల చేసింది. వాటిపై సాధ్యమయ్యే దాడులపై హెచ్చరించింది. ఫలితంగా ట్రంప్‌పై ఆశలు పెట్టుకున్న ప్రధాన కార్పొరేట్‌ సంస్థలు కూడా ప్రమాదంలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఆపిల్‌, ఇంటెల్‌, టెస్లా ఉన్నాయి. ఈ కంపెనీల ప్రాంతీయ కార్యకలాపాలపై దాడి జరగవచ్చని ఐఆర్‌జీసీ చెబుతోంది. తమ భూభాగంపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకుంటున్నట్టు ఇరాన్‌ స్పష్టంగా పేర్కొంది. ఈ ప్రతిస్పందన ఇకపై సైనిక స్థావరాలకే పరిమితం కాకుండా మొత్తం సంఘర్షణ లో భాగంగా ఇరాన్‌ భావించే సంస్థలకు కూడా విస్తరిస్తుంది.తన ప్రకటనలో ఐఆర్‌జీసీ హెచ్చరిస్తూ, ”ఇరాన్‌లో జరిగే ప్రతి ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఈ కంపెనీల యూనిట్లు ధ్వంసం చేయబడతాయని గుర్తించాలి” అని పేర్కొంది. దాడులకు ఒక కాలపరిమితిని కూడా అది నిర్దేశించింది. ఈ దాడుల పరంపర ఏప్రిల్‌ 1న ప్రారంభమవుతుంది. టెహ్రాన్‌ కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకే చర్యలు మొదలయ్యే అవకాశం ఉంది.తస్నిమ్‌ న్యూస్‌ ఏజెన్సీ ఉటంకించిన ఈ ప్రకటనతో.. యుద్ధ స్వభావం మారిందని కూడా పేర్కొంది. దాడులలో ఉపయోగిం చే వ్యవస్థల రూపకల్పన, పర్యవేక్షణలో అమెరికన్‌ ఐసీటీ , ఏఐ కంపెనీలు పాత్ర పోషిస్తున్నాయి. ఇరాన్‌, ”ఇకపై, ఈ సంస్థలే మా లక్ష్యాలుగా ఉంటాయి” అని పేర్కొంది. ఈ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా ఐఆర్‌జీసీ హెచ్చరించింది, వారి భద్రత కోసం వెంటనే తమ కార్యాలయాలను విడిచి వెళ్లాలని కోరింది. టెక్‌ కంపెనీలను ఈ విధంగా నేరుగా లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా ప్రకటించడం ఇదే మొదటిసారి. దీని కారణంగా, ప్రస్తుత సంఘర్షణ ఇప్పుడు సంప్రదాయ యుద్ధ సరిహద్దులను దాటనుంది.

నిన్న స్పెయిన్‌..నేడు ఇటలీ ట్రంప్‌నకు వరుస షాకులిస్తున్న దేశాలు
ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న అమెరికాకు కొన్నిదేశాలు షాక్‌ ఇస్తున్నాయి. యుద్ధంలో పాల్గోనే అమెరికా విమానాలకు
తమ గగనతలాన్ని మూసివేయటానికి
ఇటలీ చర్యలు తీసుకుంటోంది. అమెరికా విమానాలు ఉపయోగించుకోవడానికి అనుమతి నిరాకరించినట్టు ఇటలీ ప్రకటించింది. పశ్చిమాసియాకు వెళ్లే ముదు సిసిలిలోని
వైమానిక స్థావరంలో యూఎస్‌ బాంబర్‌ విమానాలను నిలపటానికి అమెరికా ఇటలీ
అనుమతి కోరినట్టు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇటీవల స్పెయిన్‌ కూడా ఇదే తరహా ప్రకటన చేసింది. ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంలో పాలుపంచుకునే విమానాలను తమ గగనతంలో అనుమతించబో మని ఆ దేశ రక్షణమంత్రి మార్గరెటా రోబెల్స్‌ ప్రకటించారు. ఇరాన్‌పై దాడుల్లో జోక్యం చేసుకోవటానికి ఈయూ దేశాలు అస్సలు ఇష్టపడటంలేదు. దీంతో ట్రంప్‌నకు బుర్ర వేడెక్కుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -