నవతెలంగాణ-హైదరాబాద్: దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. 11 రోజులుగా విరామంలేకుండా ఇరాన్-యూఎస్-ఇజ్రాయిల్ బాంబులతో మోత మోగిస్తున్నాయి. దీంతో ఆయా దేశాల ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. మిస్సైల్ దాడులతో ఏటు చూసినా విధ్వంసమే కన్పిస్తోంది. వేల మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు తీవ్ర గాయాలతో అవస్థలు పడుతున్నారు. భారీ నష్టం జరుగుతున్న యూఎస్-ఇజ్రాయిల్ దేశాలు దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి.
యూఎస్-ఇజ్రాయిల్ దాడులకు ఇరాన్ దీటుగా జవాబిస్తోంది. సెంట్రల్ ఇజ్రాయిల్ క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో మిస్సైల్స్ మోతతో దద్దరిల్లింది. కొన్ని గంటల సమయంలోనే హిజ్బొల్లా కూడా ఇజ్రాయిల్ సరిహద్ద ప్రాంతాలపై రాకెట్ లాంచర్లతో దాడులు చేసింది.
కాగా,గత నెల 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యాడు. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది. ఇరాన్‌కు మద్దతుగా లెబనాన్ కూడా ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది. దీంతో అప్పటి నుంచి ఒకేసారి ఇరాన్, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ప్రస్తుతం భీకర యుద్ధం సాగుతోంది.



