నేడు అమెరికాతో చర్చలు
జెనీవా : ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సోమవారం జెనీవాలో ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోస్సీతో సమావేశమయ్యారు. ఇరాన్ అణు కార్యక్రమంపై రెండో విడత చర్చలకు ముందు ఈ భేటీ జరిగింది. జెనీవాలో మంగళవారం అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు జరగబోతున్నాయి. వీటికి ఒమన్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్-బుసైదీని కూడా కలుస్తానని అరాగ్చీ చెప్పారు.
న్యాయ సమ్మతమైన, ఇరు పక్షాలకూ సమానంగా ప్రయోజనం కలిగించే ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు జెనీవా వచ్చానని ఆయన తెలిపారు. తమపై అమెరికా నేతృత్వంలో విధించిన అంతర్జాతీయ ఆంక్షలను తొలగించిన పక్షంలో అణు అంశాలపై రాజీకి సిద్ధమేనని ఇరాన్ సంకేతం ఇచ్చిన విషయం తెలిసిందే. అమెరికా-ఇరాన్ మధ్య ఈ నెల 6న జరిగిన తొలి విడత సమావేశానికి కూడా ఒమన్ ఆతిథ్యం ఇచ్చింది. ఇదిలావుండగా రష్యా, ఉక్రెయిన్ అధికారుల మధ్య మంగళ వారం జెనీవాలోనే చర్చలు జరగబోతున్నాయి. ఇవి అమెరికా ఆధ్వర్యంలో జరుగుతాయి.
ఐరాస చీఫ్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



