Wednesday, November 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉక్కు మహిళ ఇందిరాగాంధీ జయంతి వేడుకలు..

ఉక్కు మహిళ ఇందిరాగాంధీ జయంతి వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – టేకుమట్ల
ఉక్కు మహిళ ఇందిరాగాంధీ జయంతిని బుధవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కోటగిరి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులతో కలసి ఇందిరా గాంధీ చిత్రా పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా కేక్ కట్ చేసి ఇందిరాగాంధీ 108వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు  మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ భారతదేశంలో తొలి మహిళా ప్రధానిగా ఎన్నికై. పేద ,బడుగు బలహీన మైనారిటీ వర్గాల అభివృద్ధికి కృషి చేశారని, భూమిలేని పేదలకు భూములు పంచిన ఘనత ఇందిరమ్మదే అని అన్నారు. దేశంలో ఆర్థిక అభివృద్ధికి మొట్టమొదటగా 27 బ్యాంకులను జాతీయ చేసి, ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించారని ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోటగిరి సతీష్ గౌడ్, జిల్లా  చేనేత విభాగం అధ్యక్షులు ఆడెపు సంపత్, జిల్లా మాజీ యువత అధ్యక్షులు బండ శ్రీకాంత్, మండల టౌన్ అధ్యక్షులు క్రాంతి, జిల్లా నాయకులు తోట గట్టయ్య ,వంగ నరేష్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -