ఐరన్ రాడ్లు, ట్రాక్టర్ రికవరీ
నవతెలంగాణ – నవీపేట్
బాసర్ – యంచ బ్రిడ్జి నిర్మిస్తున్న అనూష ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించిన ఐరన్ స్టీల్ రాడ్లను దొంగలించిన యంచ గ్రామానికి చెందిన ఫిరాజిని అరెస్టు చేసి రెండు టన్నుల ఐరన్ రాడ్లను, దొంగతనానికి ఉపయోగించిన ట్రాక్టర్ ను రికవరీ చేసినట్లు ఎస్సై తిరుపతి సోమవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గత రెండు రోజుల క్రితం అనూష ప్రాజెక్టుకు చెందిన ఐరన్ రాడ్లు దొంగతనానికి గురి కావడంతో ప్రాజెక్టు మేనేజర్ కమ్మర పార్థసారథి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా .. యంచ గ్రామానికి చెందిన ఫిరాజీ దొంగతనానికి పాల్పడినట్లు తేలడంతో దొంగతనానికి ఉపయోగించిన ట్రాక్టర్ తో పాటు రెండు టన్నుల ఐరన్ రాడ్లను రికవరీ చేసినట్లు తెలిపారు. వీటి విలువ సుమారు లక్ష ఇరవై వేల రూపాయల ఉంటుందని అన్నారు.
ఐరన్ రాడ్ల దొంగ అరెస్టు..
- Advertisement -
- Advertisement -



