Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇంటి పన్నులో అక్రమాలు.?

ఇంటి పన్నులో అక్రమాలు.?

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
గంగారం గ్రామపంచాయతీలో 2020-2021 సంవత్సరంలో వసూలు చేసిన ఇంటి పన్ను విషయంలో అక్రమాలు జరిగాయని కాటారం బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు రామిల్ల కిరణ్ ఆరోపించారు. సోమవారం గంగారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కాటారం మండలంలోని గంగారం గ్రామపంచాయతీలో 2020-2021లో జరిగిన ఇంటిపన్నుల విషయంలో అక్రమాలు జరిగాయని తెలిపారు. బిసి ,ఎస్సీ ,ఎస్టీ, అగ్రవర్ణ పేదల వద్ద నుండి అక్రమంగా రూ.5000 నుంచి రూ.10,000 వేల వరకు ఇంటి పన్నులు వసూలు చేశారని అన్నారు. వసూలు చేసిన ఇంటిపన్నులను ప్రభుత్వ ఖజానాకు జమ చేయకుండా తమ సొంత ప్రయోజనాల కొరకు వాడుకొని నిరుపేద ప్రజలను మోసం చేశారని ఆయన అన్నారు. ఈ విషయంలో మంత్రి శ్రీధర్ బాబుకు చిత్తశుద్ధి ఉంటే కలెక్టర్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ అవినీతికి పాల్పడింది కాంగ్రెస్ పార్టీ నాయకులా.. లేక అధికారులా.. అనేది తేల్చాలని కోరారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బిఆర్ఎస్ నాయకులు చల్ల శేఖర్, జిముడ వంశీ గంగారం గ్రామ ప్రజలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -