Tuesday, January 27, 2026
E-PAPER
Homeజాతీయంఐఎస్‌ బింద్రా కన్నుమూత

ఐఎస్‌ బింద్రా కన్నుమూత

- Advertisement -

బీసీసీఐ ఆఫీస్‌బేరర్ల సంతాపం
న్యూఢిల్లీ :
భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు ఐఎస్‌ బింద్రా (84) ఆదివారం కన్నుమూశారు. 1993-1996 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేసిన ఇంద్రజిత్‌ బింద్రా.. 1978-2014 వరకు 36 ఏండ్ల పాటు పంజాబ్‌ క్రికెట్‌ సంఘం (పీసీఏ) అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ చీఫ్‌గా మొహాలి స్టేడియం నిర్మాణంలో బింద్రా కీలక భూమిక పోషించాడు. భారత క్రికెట్‌ బోర్డు పరిపాలనలో జగన్‌మోహన్‌ దాల్మియా, ఐఎస్‌ బింద్రాలు విస్మరించలేని పాత్ర పోషించారు. 1987 ఐసీసీ ప్రపంచకప్‌ భారత్‌లో నిర్వహించేందుకు జగన్‌మోహన్‌ దాల్మియా, ఎన్‌కెపి సాల్వేలతో కలిసి బింద్రా విశేష కృషి చేశారు. పాకిస్తాన్‌, శ్రీలంకలను కలుపుకుని ఐసీసీలో పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి గండి కొట్టాడు. 1986లో భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక ఉద్రిక్తతలలో భద్రతా కారణాలను ఎత్తిచూపగా.. పాక్‌ సైనిక నియంత జియా ఉల్‌ హాక్‌ భారత్‌లో పర్యటించాలని సూచించిన బింద్రా.. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా అనుమానాలకు చెక్‌ పెట్టాడు. 1996 ఐసీసీ ప్రపంచకప్‌ను భారత్‌, పాకిస్తాన్‌, శ్రీలంక సంయుక్త నిర్వహించటంలోనూ బింద్రా ముందున్నారు. ఇటు బీసీసీఐలో, అటు ఐసీసీలో నిర్ణయాధికారంలో బింద్రా తనదైన ముద్ర వేశారు. ఐసీసీ చైర్మెన్‌గా శరద్‌ పవార్‌ కొనసాగిన సమయంలో ఆయనకు సలహాదారుగా బింద్రా వ్యవహరించారు. 2014లో క్రికెట్‌ పరిపాలన నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్న బింద్రా.. జగన్‌మోహన్‌ దాల్మియాతో కలిసి భారత క్రికెట్‌ బోర్డును అత్యంత సంపన్న బోర్డుగా నిలిపేందుకు విశేషంగా కృషి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -