Saturday, March 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కళ్లేనా.? 

భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కళ్లేనా.? 

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి జిల్లా ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న కనీసం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో సుమారు ఐదు వేలకు మందికి పైగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలపై నవతెలంగాణ ప్రత్యేక కథనం..

భువనగిరికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని ఆరుట్ల కమలాదేవి, రామచంద్రారెడ్డి జన్మించిన గడ్డ, తెలంగాణ సాయుధ పోరాటం ఆంధ్ర మహాసభకు కేంద్రమైన గడ్డ భువనగిరి. జిల్లా ఏర్పడినప్పుడు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని టిఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఏర్పాటు చేయకుండా కాలయాపన చేయగా.. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోని స్వయాన రేవంత్ రెడ్డి భువనగిరి ప్రచారంకి వచ్చినప్పుడు భువనగిరి జిల్లా కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చే రెండు సంవత్సరాలు గడుస్తున్నా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.

భువనగిరి జిల్లాలో రామన్నపేట, ఆలేరు మండలాల్లో మాత్రమే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉన్నాయి. జిల్లా కేంద్రానికి చుట్టుముట్టు ఉన్న మండలాలు భువనగిరి, బీబీనగర్, వలిగొండ, ఆలేరు, ఆత్మకూరు,మోటకొండూరు, బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాల నుంచి విద్యార్థులు చదువుకోవడానికి  జిల్లా కేంద్రానికి వస్తుంటారు. జిల్లా కేంద్రానికి  5000 మంది విద్యార్థులు ప్రైవేటు కళాశాలలో చదువుతున్న పరిస్థితి ఉంది. 

జిల్లాలో జిల్లా కేంద్రంలో జాగృతి, నవభారత్, సాయి కృప  ప్రైవేటు డిగ్రీ కళాశాలలున్నాయి, ఈ డిగ్రీ కళాశాలలో 5000 మంది విద్యను అభ్యసిస్తున్నారు.  ప్రైవేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వం నుండి రావాల్సిన స్కాలర్షిప్లు సకాలంలో విడుదల కాక విద్యార్థులు పైసలు కట్టలేని పరిస్థితి ఉన్నది. భువనగిరిలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళాశాల,  ఏడెడ్ కళాశాల ఉంది, హైదరాబాద్ వాస్తువీలు ట్రస్టు ద్వారా ఈ కళాశాలలో నడుస్తున్న పరిస్థితి ఉంది,కొంత భాగం ప్రవేటు, కొంత భాగం ప్రభుత్వ రంగంలో నడుస్తా ఉన్నది, ఈ కళాశాలను ప్రభుత్వమే తన ఆధీనంలో తీసుకొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళాశాలను,  ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా ఏర్పాటు  చేయాలనే డిమాండ్ ఉంది. 

ఎస్ఎల్ఎన్ ఎస్ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ కళాశాల గా మార్చాలి: ఎస్ఎఫ్ఐ జిల్లా  కార్యదర్శి లావుడియా రాజు
డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం , ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి , ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు, ఎమ్మెల్యే , కలెక్టర్ వినతి పత్రాలు అందజేసినట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి లవుడియా రాజు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లా కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -