ఇంతకీ ఆమె మాట్లాడిన మాటలేమిటంటే, ”మనకున్నది ఒకటే కులం, అది మానవత్వం అనే కులం. ఒకే మతం ఉంది, అది ప్రేమ అనే మతం. ఒకే భాష ఉంది, అది హృదయ భాష. ఒకే దేవుడున్నాడు, ఆయన సర్వవ్యాప్తి” అని ఐశ్వర్య అన్నారు. అంతేకాదు, నిజమైన నాయకత్వం అంటే సేవ అని, మానసేవయే మాధవసేవ అని, స్వామి చెప్పిన సందేశాన్ని ఇది మనకు గుర్తుచేస్తుంది అని పేర్కొన్నారు. ఆమె సందేశం సూటిగా, స్పష్టంగా అందరి హృదయాలను తాకింది. కుల,మతాలకు అతీతంగా ఐక్యత ప్రాముఖ్యతను, ప్రేమ, మానవత్వాల గురించి నొక్కి చెప్పినట్లు ప్రసంగం ఉంది. విభజనలూ విభేదాలకు అతీతంగా ఉండాలన్న పిలుపునివ్వడం చూస్తే, ప్రధాని మోడీకి చెబుతున్నట్లే అనిపించింది.
కొన్నిసార్లు యాదృచ్ఛికంగా అవసరమైనవి జరుగుతుంటాయి. యాదృచ్ఛికమని అనుకుంటాం గానీ, ఒక భాషణమెప్పుడూ మన లోపాలను గుర్తుచేస్తూనే ఉంటుంది. అది చూసేవాళ్లకు, వినేవాళ్లకు భలే మాట్లాడారురా అని సంబరపడిపోతారు. నిత్యం అవినీతికి పాల్పడేవాళ్ల దగ్గర నీతిసూత్రాల గురించి చర్చించినప్పుడు వాళ్ల మానసిక స్థితి ఎట్లా ఉంటుందో ఊహించుకోవచ్చు. వంద మర్డర్లు చేసినోడి ముందు, అహింస పాఠాలు వినిపించినప్పుడు అతడు మారతాడని అనుకోగలుగుతామా! మారకపోయినా హింసలో ఉన్న అమానవీయత ఎంతో తెలిసి వస్తుందని అనుకుంటాము. ఏమో! మానవతా లక్షణాలు ఆధిక్యంలో ఇంకా వాళ్లలో ఉంటే మారనూవచ్చు. ప్రస్తుతానికి అలాంటి ఆశలేమీలేవుగానీ మంచి మనుషులందరూ సంతోషించడానికి వీలవుతుంది. అవినీతిపరులు, కుట్ర దారులు, మూర్ఖ శిఖామణులు ఎవరైనా, వాళ్లు, మేము గొప్పవాళ్లమని అనుకుని కొనసాగినంతకాలం మారనుగాక మారరు. ఇక మోసం, దగా, అసత్యం మీదనే వారి ఉనికి ఆధారపడి ఉన్నప్పుడు ఇలాంటివాటికి వాళ్లేమీ సిగ్గుపడరు.పైకి నీతులు మాట్లాడుతూ లోనంతా అవినీతిపరులై బతుకుతున్నవారే చాలామంది మన నేతలై ఉన్నారు. మాటలకూ చేతలకూ సంబంధాన్ని ఎప్పుడో విడగొట్టుకున్నాం కదా! ఇప్పుడంతా చెప్పేదొకటి చేసేదొకటి.
మొన్న ఏపీలోని అనంతపురం సత్యసాయి కేంద్రంలో జరిగిన సభను విన్నప్పుడు పై విషయాలన్నీ మదిలో తిరిగాయి.ఎందుకంటే, సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను బుధవారం నాడు, ఆ ట్రస్టు నిర్వాహకులు ఘనంగా జరిపారు.ఆ ఉత్సవ సభకు మన ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, క్రికెటర్ సచిన్‌తో పాటు ప్రసిద్ధ సినీతార ఐశ్వర్యరారు కూడా పాల్గొన్నారు.ఇంతవరకూ జరిగిన దాంట్లో ఏ విశేషమూ లేదు. కానీ ఆ సందర్భంలో మోడీగారి సమక్షంలో ఐశ్వర్య చేసిన ప్రసంగం, చెప్పిన మాటలు, వాటి భావాలు, ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వేలాదిమంది సాయిభక్తులూ అనుచరులూ ఆమె ప్రసంగ విషయాలు విని పెద్తయెత్తున హర్షధ్వానాలు చేయడం, చప్పట్ల రూపంలో ప్రతిస్పందన రావటం మన మోడీగారికి మనసులో కొంత ఇబ్బంది కలిగి ఉంటుంది. అది చాలా చిన్న తేలికయిన ప్రసంగమే, కానీ పదకొండేండ్లుగా పాలనలో జరుగుతున్న దానికి సమాధానంగా నిలిచింది. ఆమె చెప్పిన మాటలు దేశంలోని ప్రతివీధిలో మోగాల్సిన మాటలు. ముఖ్యంగా పాలకుల చెవులల్లో నిత్యం మారుమోగాల్సిన మాటలు.
ఇంతకీ ఆమె మాట్లాడిన మాటలేమిటంటే, ”మనకున్నది ఒకటే కులం, అది మానవత్వం అనే కులం. ఒకే మతం ఉంది, అది ప్రేమ అనే మతం. ఒకే భాష ఉంది, అది హృదయ భాష. ఒకే దేవుడున్నాడు, ఆయన సర్వవ్యాప్తి” అని ఐశ్వర్య అన్నారు. అంతేకాదు, నిజమైన నాయకత్వం అంటే సేవ అని, మానసేవయే మాధవసేవ అని, స్వామి చెప్పిన సందేశాన్ని ఇది మనకు గుర్తుచేస్తుంది అని పేర్కొన్నారు. ఆమె సందేశం సూటిగా, స్పష్టంగా అందరి హృదయాలను తాకింది. కుల,మతాలకు అతీతంగా ఐక్యత ప్రాముఖ్యతను, ప్రేమ, మానవత్వాల గురించి నొక్కి చెప్పినట్లు ప్రసంగం ఉంది. విభజనలూ విభేదాలకు అతీతంగా ఉండాలన్న పిలుపునివ్వడం చూస్తే, ప్రధాని మోడీకి చెబుతు న్నట్లే అనిపించింది. ఈయనగారూ తన బృందమూ పదకొండేండ్లుగా మతం గురించీ, ఇతర మతాలు శత్రువులనీ, వారి నుంచి, మనకు ప్రమాదముందనీ విభేదాలనూ, విభజనలనూ, విద్వేషాన్ని నూరిపోయటమే పనిగా చేస్తున్నారాయే. ఇక కులాలు ఉండాలని, మనుధర్మం పాటించాలనీ బోధించటం, భాషా వివాదాల్ని సృష్టించడం అదే పనిగా సాగిస్తున్నారు.
ఇక ఒకే దేవుడున్నాడు అనే భావనకు మన మోడీగారు పూర్తి వ్యతిరేకమాయే. గోద్రాలో వేలాదిమందిని చంపినవారికి, ఆవు మాంసముందని నిలువునా చంపేసిన హింసావాదులకు ప్రేమనే మతమని చెపితే తలకెక్కుతుందా! తిట్లలా అనిపించదూ! ”రఘుపతి రాఘవ రాజారాం, ఈశ్వర్ అల్లా తేరేనామ్” అని చెప్పిన మహాత్మున్ని చంపిన వారసులకు ఐశ్వర్య మాటలు లాగి కొడుతున్నట్లు అనిపించే ఉంటది. మనుషులంటేనే మతాలుగా, కులాలుగా చూస్తున్న వీరి చూపునకు పూర్తి విరుద్ధమైన మానవత్వ భాషణం చేసింది ఆవిడ. ఆమె మాట్లాడింది కొత్త విషయమేమి కాదు. నిజమైన ఆధ్యాత్మికత గల వాళ్లు ఆ భక్తిభావన కలవాళ్లు చెప్పే విషయాలే అవి. మన భారతీయ సంస్కృతిలో కొనసాగుతున్న భావనలే. అయినా, ఐశ్వర్యరారు చాలా ధైర్యం చూపింది. నిజమైన కళాకారిణిలా మాట్లాడింది. ఇంకెవరూ కూడా ఇలా మాట్లాడే ధైర్యం చేయలేదు. అందుకు ఆమెకు అభినందనలు. సినీరంగంలో ఉన్న మహామహులు అలాంటి మానవీయ విలువలను మరచి, అధికారానికి వంత పాడటం గురించి, ఈ మాటలు కనువిప్పు కలిగించాలని కోరుకుందాం. ఆమె మాటలు విన్న మోడీగారు మనసులోనైనా సిగ్గుపడతారని ఆశిద్దాం!



