Sunday, February 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రశ్నిస్తే వేధింపులా.?

ప్రశ్నిస్తే వేధింపులా.?

- Advertisement -

మండల అధ్యక్షులు జోగు ప్రదీప్
వివిధ గ్రామాలలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
నవతెలంగాణ –  తిమ్మాజిపేట

తెలంగాణ సాధకుడు కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ తిమ్మాజిపేట మండలంలోని వివిధ గ్రామాలలో బిఆర్ఎస్  నాయకులు కార్యకర్తలు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు. తిమ్మాజిపేట మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై నిరసన తెలుపడంతో గంటపాటు వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు జోగు ప్రదీప్, మాజీ ఎంపీపీ రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దేశంలో అన్ని రాష్ట్రాలు తెలంగాణ  వైపు చూసే విధంగా  రాష్ట్రంగా నిలబెట్టిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు పరాకాష్టకు చేరాయని వారు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే కాళేశ్వరం కమిషన్లని, సిట్ అని, ఫోన్ ట్యాపింగ్ అని రకరకాల పేర్లతో కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, ఇప్పుడు ఏకంగా కేసీఆర్ ని వేధిస్తున్నారని ఆరోపించారు.

చేసిన ఈ స్కామ్‌ల నుండి తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి కేసీఆర్ కు నోటీసుల పేరుతో  డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. కెసిఆర్ తాకితే యావత్ తెలంగాణలోని కార్యకర్తలం ఒక్కటై నిన్ను నీ కాంగ్రెస్ నాయకులు రోడ్డు మీద తిరగకుండా స్తంభింప చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పి స్వామి, రామచంద్రారెడ్డి, అయబ్ ఖాన్, కొత్త వెంకటేష్, రజాక్, సలావుద్దీన్, రాజేందర్ రెడ్డి, సత్యం యాదవ్, పండు, రఫీక్, ఐటీ శంకర్, ప్రశాంత్, సైఫుద్దీన్, ఇబ్రహీం, రమేష్, జంగయ్య, వేంకటస్వామి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -