Monday, December 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉందామా..తప్పుకొందామా!

ఉందామా..తప్పుకొందామా!

- Advertisement -

గ్రామ పోరు పోటీపై అభ్యర్థుల డైలమా
కొనసాగుతున్న బుజ్జగింపుల పర్వం
నవతెలంగాణ – మల్హర్ రావు.

గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు పోటీలో ఉందామా..తప్పుకొందామా అంటూ సందిగ్ధంలో పడ్డారు.మూడవ విడత ఎన్నికల్లో భాగంగా మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పెద్ద ఎత్తున ఆశావహులు నామినేషన్లు దాఖలు చేశారు.ఉపసంహరించుకోవడానికి ఈనెల 9వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు సమయం ఉంది.దీంతో సర్పంచ్ పదవిలో కూర్చుందామనుకునే వారు పోటీ చేస్తున్న మిగతా అభ్యర్థులను బుజ్జగిస్తున్నారు. కొంతమంది నాయానో బయానో ఇచ్చి ప్రత్యర్థులతో బేరసా రాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నామినేషన్ వేసిన అభ్యర్థులు పోటీలో ఉందామా..తప్పుకొందామా అనే డైలమాలో పడ్డారు.నామినేషన్ ఉపసంహరణకు ఎన్నికల సంఘం ప్రత్యేక గైడ్లైన్స్ జారీ చేసింది.అభ్యర్థి సంబంధిత రిటర్నింగ్ అధికారికి ప్రత్యేక ఫార్మాట్లో దరఖాస్తు అందించాలి.తానే స్వచ్చందంగా నామినేషన్ ఉపసంహరించుకుటున్నానని ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, డబ్బు ప్రలోభాలు లేవని స్వీయ ధ్రువీకరణ ఇవ్వాలి.రిటర్నింగ్ అధికారి దానికి సంతృప్తి చెందినట్లయితే నామినేషన్ ఉప సంహరణ చెల్లుబాటు అవుతుంది.ఈ ప్రక్రియ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థులు, వారికి కేటాయించిన గుర్తులను అధికారులు ప్రకటిస్తారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -