Sunday, April 5, 2026
E-PAPER
Homeసినిమా'నిజమేనా నే విన్నది నిజమేనా'

‘నిజమేనా నే విన్నది నిజమేనా’

- Advertisement -

న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేస్తూ హీరో కిరణ్‌ అబ్బవరం సుమైర స్టూడి యోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్‌ పై నిర్మిస్తున్న సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. తేజ వేల్పుచర్ల సహ నిర్మాత.
ఈ చిత్రంతో సాయి తేజ్‌, వేద జలంధర్‌ హీరో, హీరోయిన్స్‌గా, వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడిక్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
ఈ నేపథ్యంలో శనివారం ఈ సినిమా నుంచి ‘నిజమేనా’ లిరికల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పాటను ఎమోషనల్‌ ఫీల్‌తో వంశీకాంత్‌ రేఖన కంపోజ్‌ చేశారు. సనరే లిరిక్స్‌ రాయగా, యువ గాయని జయశ్రీ పల్లెం పాడారు. ‘నిజమేనా నిజమేనా నే విన్నది నిజమేనా, నువు పలికిన ఆ మాటే పొరబడి విన్నానా, నిజమేనా నిజమేనా నువ్వన్నది నిజమేనా కను తెరిచి నీ ముందే కలనే కన్నానా, ప్రతి క్షణం నీ వెంటే ఇన్నాళ్లుగా తిరిగానే, నేనేమిటో కొంచెం కూడా అర్థం కాలేదా…’ అంటూ హార్ట్‌ టచింగ్‌గా సాగుతుందీ పాట.
సాయి తేజ్‌, వేద జలంధర్‌, ప్రదీప్‌ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్‌, సత్యనారాయణ, లతీష్‌, తదితరులు ఈ చిత్రంలో ముఖ్య తారాగణం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -