నవతెలంగాణ – ముంబై: శ్రియ శరణ్, తేజ సజ్జా, జగపతి బాబు మరియు రితికా సింగ్ లు ‘ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ కు వచ్చినప్పుడు మీకు ఏమి లభిస్తుంది? మీకు పలు భాషలలో జోకులు, కొన్ని చిలిపి మాటలు (ఎక్కువగా కపిల్‌పై) మరియు చాలా దక్షిణాది స్వాగ్‌లు వస్తాయి! కపిల్ తనకు తెలిసిన ఏకైక తెలుగు పదం ‘తెలుగు’ అని ఒప్పుకోవడం ద్వారా ఈ హాస్యపు జల్లును ప్రారంభించాడు, తన అతిథులకు హిందీ కూడా తెలియకపోవడంతో, “బాకీ బాచీ ఇంగ్లీష్, దేఖ్తే హై కబ్ తక్ బచ్తీ హై ముజ్సే” అని జోడించాడు. ఆ తర్వాత నవ్వుల జల్లు ప్రారంభమైనది. హృదయంలో ప్రేమను నింపుకున్న వ్యక్తి జగపతి బాబు అని తేజ సజ్జా చెప్పడం, పొట్ట చెక్కలయ్యేలా కపిల్ మరియు తేజ చిలిపిగా మాట్లాడటం , ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో రజనీకాంత్ నృత్యం చేయడం వంటి ఎన్నో చిలిపి చేష్టలతో ఈ ఎపిసోడ్ సాగిపోతుంది.
మధురమైన మరియు సినిమా తీరులో శ్రియ శరణ్ తన భర్త ఆండ్రీ కోస్చీవ్‌ను మొదటిసారి ఎలా కలిశారనే దాని గురించి చెప్పారు. ఆమె మాట్లాడుతూ, “నేను వెళ్లకూడని నెలలో విమానం తప్పుగా బుక్ చేసుకున్నాను. దానితో మాల్దీవుల దక్షిణ భాగానికి క్రూయిజ్‌లో ఒంటరిగా ప్రయాణించాల్సి వచ్చింది , అక్కడే నేను ఆండ్రీని కలిశాను. మాకు ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలియదు కానీ ఏదో ఒకవిధంగా మేము కలిసి డైవ్‌లు చేయడం ప్రారంభించాము. అలా మా మధ్య ప్రేమ ప్రారంభమైంది..” అని అన్నారు.
ఆమె ఇంకా చెబుతూ “అతను చూసిన నా మొదటి చిత్రం ‘ దృశ్యం’ . ఆ తర్వాత అతను చాలా భయపడ్డాడు!” అన్నారు. డైవ్ కర్తే కర్తే వో ఏక్ దూస్రే కే ప్యార్ మే దూబ్ గయే… క్యా దృశ్యం కా నెక్స్ట్ సీక్వెల్ ఓషన్ థీమ్డ్ హోగా, ఇన్స్పైర్డ్ బై శ్రియ ప్రేరణ? (డైవ్ చేస్తూ, చేస్తూ ఒకరి ప్రేమలో ఒకరు పడిపోయారు… దృశ్యం సీక్వెల్ తరువాత సముద్ర నేపథ్యంతోనే ఉంటుందా, శ్రియ స్పూర్తితో..?)
ఇదే సమయంలో , కపిల్ , బ్లాక్ బస్టర్ ఆశ్చర్యాన్ని అందిస్తూ, పుష్ప తప్ప మరెవరూ చేయలేని ఐకానిక్ “ఝుకేగా నహిన్ సాలా” స్వాగ్‌తో అందరినీ ఆశ్చర్య పరిచారు. జగపతి బాబు తన రాజకీయ వన్-లైన్‌తో అందరినీ చీల్చివేశారు : “దక్షిణాది సూపర్‌స్టార్‌లు సాధారణంగా రాజకీయాల్లోకి వెళతారు. నేను ఇప్పటివరకు ఎప్పుడూ విలన్‌గానే నటించాను, కానీ రాజకీయాల్లో చేరితే నేనే హీరో అవుతాను ఎందుకంటే వహాన్ తో ఔర్ భీ జ్యాదా విలన్స్ హై. ( అక్కడ ఇంకా ఎక్కువ విలన్స్ వున్నారు) ” అని అన్నారు. స్వాగ్, సాస్ మరియు సిజ్లింగ్ పంచ్‌లైన్‌లతో కూడిన ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో ఈ వారం ఎపిసోడ్ ఈ సెప్టెంబర్ 13వ తేదీ శనివారం రాత్రి 8 గంటలకు నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే ప్రసారమవుతుంది. ‘ మిరాయ్’ తారాగణం ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది.