Friday, April 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసతీశ్‌ షా కుటుంబ సభ్యులతోచర్చకు సిద్ధమా?

సతీశ్‌ షా కుటుంబ సభ్యులతోచర్చకు సిద్ధమా?

- Advertisement -

మంత్రి పొంగులేటికి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ సవాల్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సతీశ్‌ షా కుటుంబ సభ్యులతో అమరవీరుల స్థూపం వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చర్చకు సిద్ధమా?అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ సవాల్‌ విసిరారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సతీశ్‌ షా, ఆయన సతీమణి పల్లవి షాతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పొంగులేటి భూ బాధితులతో తెలంగాణ భవన్‌ జనతా గ్యారేజీగా మారిందని చెప్పారు. రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలో పొంగులేటి రియల్‌ ఎస్టేట్‌ మాఫియా నడువుతున్నారని ఆరోపించారు. ఇది సతీశ్‌షా, పల్లవి షాల సొంత వ్యవహారం కాదనీ, తెలంగాణ భూముల సమస్య అని అన్నారు. 169, 244, 245 సర్వే నెంబర్లలో 27 ఎకరాల భూమి సతీశ్‌ షా కుటుంబ సభ్యులకు ఉందన్నారు. భూ సరిహద్దులు సరిగా ఉంచుకునేందుకు 2018లో 245, 169 సర్వే నెంబర్లలో సతీశ్‌ షా కుటుంబ సభ్యులే మండల్‌ సర్వే కోరుకున్నారని వివరించారు.

వారి బంధువు అభినవ్‌ షాతో బౌండరీస్‌ ఫిక్స్‌ చేసుకున్నారని గుర్తు చేశారు. 2019లో రెండో సర్వే జరిగింన్నారు. హైకోర్టుకు వెళ్లారనీ, 2021లో మళ్లీ సర్వే నిర్వహించారని చెప్పారు. 258 సర్వే నెంబర్‌లో అభినవ్‌ షా భూమి ఉందని అన్నారు. మంత్రి పొంగులేటి కొడుకు డెవలప్‌మెంట్‌ కోసం అభినవ్‌ షా తో ఒప్పందం చేసుకున్నప్పట్నుంచి వివాదం మొదలైందన్నారు. 169 సర్వే నెంబర్‌లో అప్రోచ్‌ రోడ్‌ కోసం సతీశ్‌ షా, పల్లవి షా ఇంటికి హర్ష, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వచ్చారని చెప్పారు. భూమి ఇవ్వాల్సిందేనని పొంగులేటి అడిగారనీ, వారు తిరస్కరించారని అన్నారు. ఎన్ని సార్లు పోలీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో సతీశ్‌ షా కుటుంబ సభ్యులు రాజేంద్ర నగర్‌ కోర్టుకెళ్లి ఇంజక్షన్‌ ఆర్డర్‌ తీసుకొచ్చారని వివరించారు. సతీశ్‌ షా భూముల నుంచి పొంగులేటి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆ భూములు కాపాడుకునేందుకు వారికి న్యాయస్థానాలు తప్ప వేరే దిక్కు లేదని అన్నారు. దీనిపై బీఆర్‌ఎస్‌ పోరాటాన్ని ఆపబోదని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -