Friday, April 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తూతూ మంత్రంగా విచారణ?

తూతూ మంత్రంగా విచారణ?

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
యాదాద్రి భువనగిరి జిల్లాలో కొమ్మల నరికివేత పేరుతో  నిరంతరం ఏదో ఒకచోట చెట్లను యదేచ్చగా నరుకుతున్నారు. ఈ  విషయపైన నవతెలంగాణ పత్రికలో సర్కార్ చెట్లపై గొడ్డలి వేటు అనే మినీ కథను ప్రచురించగా.. స్పందించిన అటవీశాఖ అధికారులు విచారణ చేశారు. కాగా విచారణ తూతూ మంత్రంగా చేశారని ఆరోపణలు ఉన్నాయి. భువనగిరి మండలానికి సంబంధించి ఎలాంటి చెట్లు కొట్టలేదని, యాదగిరిగుట్ట మండలం మహబూబ్ పేట గ్రామంలో సుమారు పదికి పైగా చెట్లు నరికివేసిన కేవలం ఒకే చెట్టుకు మాత్రమే రూ..14000 ఫైన్ విధించినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా అటవీశాఖాధికారి సుధాకర్ రెడ్డి తెలిపారు. హరితహారం పేరుతో మొక్కలను నాటుతూ  రోడ్డు వెంబడి, వెంచర్లు ఉన్నచోట హరితహారం మొక్కలను యదేచ్ఛగా తొలగిస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి . ఇప్పటికైనా జిల్లావ్యాప్తంగా పూర్తిస్థాయిలో విచారణ చేసి  వాల్టా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -