– బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్..
నవతెలంగాణ – తొగుట: కరువు కాటకాలతో తల్లడిల్లిన తెలంగాణకు నీళ్లు ఇచ్చిన కెసిఆర్ పై కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీని వాస్ ఆరోపించారు. సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మండలంలోని మల్లన్న సాగర్ డెలి వరీ పంపుల వద్ద బీఆర్ఎస్వీ శ్రేణులతొ కలిసి మాజీ సీఎం కెసిఆర్ చిత్ర పాఠానికి గోదావరి జలా లతో జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు పిల్లర్లు కుంగితే ప్రాజెక్టు మొత్తం అవినీతిమయమై నట్టు, లక్ష కోట్లు అవి నీతి అంటూ కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కృంగిన పిల్లర్లను మరమ్మత్తు చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇస్తే రేవంత్ సర్కార్ కుట్ర పూరితంగా రిపేర్ మరిచి, తెలంగాణను ఎండబెట్టే ప్రయత్నం చేస్తుందని ద్వాజమేత్తారు.
తెలంగాణకు నీళ్లు ఇవ్వడమే కేసీఆర్ చేసిన నేరమా అని ప్రశ్నించారు. 20 నెల లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మత్తు చేయాల్సింది పోయి కాళేశ్వరం కమిషన్ పేరు మీద, కేసీఆర్ మీద లేని, పోనీ నిందలు మోపడం సరి కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా కెసిఆర్ తెలంగా ణ ప్రజలు కాపాడుకుంటారని పేర్కొన్నారు. కార్య క్రమంలో దుబ్బాక నియోజకవర్గ బిఆర్ఎస్వి ఇన్చార్జ్ సురేష్ గౌడ్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, మండల యూత్, బీఆర్ఎస్వీ అధ్యక్షులు మాదాసు అరుణ్ కుమార్, నంట పరమేశ్వర్ రెడ్డి, చిలువేరి మల్లారెడ్డి, దోమల కొమురయ్య, వేల్పుల స్వామి, అనిల్, యూత్ నాయకులు అనిల్ కుమార్, చింతా బైరా రెడ్డి, భైరాగౌడ్, బాలరాజు, ప్రశాంత్ దితరులు ఉన్నారు