Sunday, October 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ జూనియర్ కళాశాలకు దారేదీ.?

ప్రభుత్వ జూనియర్ కళాశాలకు దారేదీ.?

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులకు నడక దారి లేక గత కొన్ని ఏళ్లు గా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాశాలకు వచ్చే అధ్యాపకులు అధికారులు దారి లేకపోవడంతో వాహనాలను రోడ్లపై నిలిచి నడిచి వెళ్లే దుస్థితి నెలకొంది. జుక్కల్ మండలంలో కోట్ల రూపాయలతో నిర్మించిన మోడల్ జూనియర్ కళాశాలను రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గం లోని మండల కేంద్రంలో కోట్ల రూపాయలతో నిర్మించారు. కళాశాల ఆవరణలో అన్ని సౌకర్యాలు సమకూర్చినప్పటికీ కళాశాలకు విద్యార్థులు వెళ్లేందుకు దారి లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే నీటి గుంతలో నుండి దాటుకుంటూ వెళ్తూ బురదలో నడవాల్సిన దుస్థితి నెలకొంది.

కళాశాల ప్రారంభం నాటి నుండి ఇదే పరిస్థితి నెలకొనడంతో దుస్థితి పైన అడిగే వారు కరువయ్యారు. పలుమార్లు విద్యార్థి సంఘాలు ప్రభుత్వం దృష్టికి , ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లిన ఎటువంటి ఫలితం రాలేకపోవడంతో ప్రస్తుతం అదే విధంగా దారి లేక సమస్య కొనసాగుతుంది. చెప్పుకోవడానికి మాడల్ కళాశాల కానీ దారి లేక అవస్థలు పడుతున్న జిల్లా అధికారులు కళాశాలలో విద్యనభ్యసించే విద్యార్థిని విద్యార్థులు జుక్కల్ మారుమూల ప్రాంతంలో అధికారులు ప్రజా పతినిధులు దృష్టి కేంద్రీకరించకపోవడం గమనార్హం. వార్షిక పరీక్షలు కొనసాగుతున్న సమయంలో తనికీలకువచ్చే ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులకు తిప్పలు తప్పడం లేదు. ప్రతి ఏటా వర్షాకాలం వచ్చిందంటే ముఖ్యంగా విద్యార్థినిలకు, విద్యార్థులకు, అధికారులకు, అధ్యాపకు, ఈ ఫీట్లు తప్పడం లేదు.

ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు ఇంటర్మీడియట్ విద్యాశాఖ జిల్లా అధికారులు జుక్కల్ మండల కేంద్రంలోని మోడల్ జూనియర్ కళాశాల పైన దృష్టి కేంద్రీకరించి సమస్యను పరిష్కరించే విధంగా స్పందించి అడుగులు వేయాలని మండల ప్రజలు , విద్యార్థుల తల్లి దండ్రులు,  విద్యార్థిని , విద్యార్థులు తదితరులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యార్థిని విద్యార్థుల పేరెంట్స్ విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి సమస్యను విన్నవించి వారి సహకారంతో రోడ్డుపైకి రావాల్సిన దుస్థితి ప్రభుత్వమే కల్పించినట్టు ఉంటుందని ,  నిరసన కొనసాగిస్తామని ప్రభుత్వానికి సూచించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -