– మంత్రి మాటలను వెనక్కి తీసుకోవాలి
– మృతికి కారణమైన వారిని శిక్షించాలి
– దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
ఇటీవల జిల్లాల గడ్డలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతి చెందగా బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ పాఠశాలను సందర్శించి విద్యార్థి వివేక్ ప్రమాదవశాత్తు మరణించాడని అనడంలో అంతర్యం ఏంటని, మృతికి కారకులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గురువారం హుస్నాబాద్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు, దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోక చేపట్టారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ.. అధికారులు విచారణ చేపడుతున్నామని చెప్పుతూనే విద్యార్థి వివేక్ ఆటలు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగిందని మంత్రి మాట్లాడటాన్ని తప్పు బట్టారు.
మంత్రి మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని వివేక్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థి వివేక్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేస్తూ మృతికి కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం తో పాటు రూ 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ లక్ష్మారెడ్డి పోలీసులు ఆందోళన కార్యక్రమానికి వచ్చి ఆందోళన కార్యక్రమాన్ని విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి పేరెంట్స్ సానాది సత్యనారాయణ, లావణ్య , బిళ్ళం రాములు, దళిత సంఘాల నాయకులు జాతీయ మాల మహానాడు రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్ ఎలక దేవయ్య, హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఆరె కిశోర్, బొజ్జ హరీష్ , బి ఆర్ ఎస్ వి పట్టణ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్, మంకాల రమేష్, సానది లక్ష్మణ్, సానది యాదగిరి, గుమ్మడి సాయిశ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు.
మంత్రే విద్యార్థి ప్రమాదవశాత్తు మరణించాడనడంలో అంతర్యమెంటీ ..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES