Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్ట్రిపుల్ ఐటీలో హాకీ ఆడటం లేదా.?

ట్రిపుల్ ఐటీలో హాకీ ఆడటం లేదా.?

- Advertisement -

వీసి నీ ప్రశ్నించిన మంత్రి..         
నవతెలంగాణ -ముధోల్
బాసర ట్రిపుల్ ఐటీలో హాకీ ఆడటం లేదని విధ్యార్థులు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు చెప్పటంతో ఆశ్చర్యానికి లోనైన సంఘటన బుధవారం బాసర ఆర్జీయూకేటిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… బాసర ట్రిపుల్ ఐటీలో జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు విధ్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ట్రిపుల్ ఐటీ లో ఇటివల కాలం వరకు చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో మంత్రి విధ్యార్థులో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు జిల్లా ఇంఛార్జి మంత్రి హోదాలో మొదటీ సారిగా ట్రిపుల్ ఐటీకీ వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి విధ్యార్థులతో మాట్లాడించారు.

  ట్రిపుల్ ఐటీలో విధ్యార్థులు ఆడుతున్న ఆటల గురించి ముందుగా మంత్రి తెలుసుకున్నారు. తాము ఆడుతున్న కొన్ని ఆటల పేర్లు విధ్యార్థులు చెప్పారు. దీంతో హాకీ  ఆడటం లేదని విషయం బయట పడింది. అక్కడే ఉన్న వీసి గోవర్ధన్ ను మంత్రి ప్రశ్నించారు. వందలాది ఎకరాల విస్తీర్ణంలో  ఉన్న ట్రిపుల్ ఐటీలో ప్రముఖ ఆటలను ఎందుకు ప్రోత్సాహించటంలేదని అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆట పాటలు ఆవసరం అని సూచించారు. ట్రిపుల్ ఐటీ లో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా పెంపొందించాలని సూచించారు. తాను సాంస్కృతిగా శాఖ మంత్రి కావటంతో తన నిధుల నుండి రూ.1 కోటి మంజూరు చేస్తానని మంత్రి ప్రకటించారు. సాంస్కృతిక కార్యక్రమాల గురించి ట్రిపుల్ ఐటీలో  విద్యార్థులకు తెలియజేయడానికి ప్రత్యేక టీంను  నియమిస్తానని మంత్రి చెప్పారు. విద్యార్థుల మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వానికి  క్రీడా పోటీలు ఉపయోగపడతాయన్నారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వీసీని ఆదేశించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad