ప్రజల కోసం పనిచేసే పాలిటిక్స్ పోయి.. పవర్ (అధికారం) కోసమే పాకులాడే పాలిటిక్స్ నడుస్తున్న రోజులివి. అగ్రనేతలను ప్రసన్నం చేసుకోవటం, వారి చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవటమే పనిగా ఈ తంతు నడుస్తోంది. సరే పోనీలే…ఇది వాళ్లిష్టం, మనకెందుకులే అనుకుని సర్దుకుపోతున్నారు జనాలు. కానీ ఆ జనాలకు కూడా పిచ్చెక్కేలా చేస్తున్నారు నాయకులు. అది పండగైనా, పబ్బమైనా, పెండ్లయినా, పుట్టినరోజైనా, శుభమైనా, అశుభమైనా వదలకుండా రోడ్లమీద తమ నేతలను పొగుడుతూ బ్యానర్లు, ఫ్లెక్సీలు కడుతూ సాధారణ జన జీవితానికి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడు తున్నారు. ఈ విషయంలో కూడా రాజీపడి పోతున్నారు మన సిటిజన్స్. ఇప్పుడు నేతల పిచ్చి పీక్‌స్టేజ్ కెళ్లి, చిన్నచిన్న రోడ్లు, బస్తీలు, కాలనీలను వదిలి, బస్సులు, వాహనాల రద్దీ, జనసమ్మర్దం ఎక్కువగా ఉండే రహదారులను వదలకుండా పెద్దపెద్ద ఫ్లెక్సీలను రోడ్డుకు ఇరువైపులా పెట్టి వాహన దారులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నారు… ఇలాంటి నాయకాగ్రేసరులను ఏమనాలో మీరే చెప్పండి…
– కే.నరహరి
ఇంత ఆర్భాటమా..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES