Saturday, November 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబడి పిల్లలకు పురుగుల అన్నమా?

బడి పిల్లలకు పురుగుల అన్నమా?

- Advertisement -

మాజీమంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్‌

బడి పిల్లలకు పురుగుల అన్నం పెట్టిన ఘటనపై మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పిల్లలకు పురు గులన్నం పెట్టిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
ఇలాంటి ఘటనలు పునరా వృతం కాకుండా చూడాలని కోరారు. ఈ మేరకు ఆయన శుక్ర వారం ఒక ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో యంగ్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ గురుకులాలంటూ డబ్బా కొట్టుకునే సీఎం రేవంత్‌రెడ్డి ముందు ప్రభుత్వ పాఠశాలల పిల్ల లకు పురుగులు లేని అన్నం పెట్టా లని సూచించారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకే అన్న బెదిరింపులు ఎక్కడికి పోయాయని తెలిపారు. విద్యాశాఖపై ఎన్ని సార్లు సమీక్షలు చేశారు, కల్తీ ఆహారం పెడుతున్న ఎంత మందిని జైలుకు పంపారని అడిగారు. సీఎం మాటలకు విలువ లేదనీ, ఆచరణకు దిక్కులేదని పేర్కొ న్నారు. బడిలో చదువుకోవా ల్సిన విద్యార్థులు పురుగులన్నం వద్దంటూ రోడ్లెక్కి నిలదీస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. బడి పిల్లలకు సరిగ్గా అన్నం పెట్టలేని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ రాష్ట్రానికి ఉండి ఏం లాభమని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -