Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఇస్లాంపూర్‌ ఇకపై ఈశ్వర్‌పూర్‌

ఇస్లాంపూర్‌ ఇకపై ఈశ్వర్‌పూర్‌

- Advertisement -

మరో ఊరికీ పేరు మార్చిన బీజేపీ పాలిత మహారాష్ట్ర సర్కార్‌
ముంబయి :
ఇస్లాంపూర్‌ను ఈశ్వర్‌పూర్‌గా మారుస్తూ మహారాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నది. ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు వెల్లడించారు. అదేవిధంగా ఛత్రి నిజాంపూర్‌ను రారుగడ్‌వాడీ మార్చనున్నట్టు తెలిపారు. ఇస్లాంపూర్‌ పేరును మార్చాలని హిందూ సంఘాలు 1980 నుంచి డిమాండ్‌ చేస్తున్నాయి. అదేవిధంగా ఛత్రపతి శివాజీ రాజ్యానికి రాజధానిగా ఉన్న ఛత్రి నిజాంపూర్‌ పేరును మార్చాలని స్థానిక ఎమ్మెల్యేలు గతకొంతకాలంగా కోరుతున్నారు.ఔరంగాబాద్‌, ఉస్మానాబాద్‌ జిల్లాల పేర్లను ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే నేతృత్వంలోని గత ప్రభుత్వం మార్చిన విషయం తెలిసిందే. ఔరంగాబాద్‌ను ఛత్రపతి శంభాజీ నగర్‌గా, ఉస్మానాబాద్‌ను ధారాశివ్‌గా మార్పుచేసింది. అయితే ఈ జిల్లాల పేర్లను మార్చాలని ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాఢ ప్రభుత్వం 2022 జూన్‌లో నిర్ణయించింది. ఉద్ధవ్‌ మంత్రివర్గం ఔరంగాబాద్‌ను శంభాజీ నగర్‌గా మార్చాలని నిర్ణయించగా, శిండే ప్రభుత్వం దీనికి ఛత్రపతి శంభాజీ నగర్‌ అని పేరు పెట్టింది. అదేవిధంగా 2020లో అప్పటి ప్రభుత్వం బాంబే సెంట్రల్‌ స్టేషన్‌ పేరును శంకర్‌షేత్‌ ముర్కుటేగా మార్చింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img