పాలకు సరైన బ్యాక్టీరియా యాడ్ చేయడం వల్ల కమ్మటి పెరుగు తయారవుతుంది. కాస్త పుల్లగా అనిపించినా ఇది అనేక రకాల పోషకాలతో కూడి ఉంటుంది.అంతేకాకుండా కొలెస్ట్రాల్ లెవల్ తగ్గి బీపీ కంట్రోల్‌లోకి వస్తుంది. ఫలితంగా శరీరంలో రోగ నిరోధకవ్యవస్థ బలపడుతుంది. కొన్నిఅధ్యయనాల ప్రకారం హైపర్ టెన్షన్ లాంటి సమస్యలు ఉన్న వారు నేచురల్ రెమెడీగా పెరుగును వాడతారట. పెరుగును సరైన మోతాదులో ప్రతిరోజూ తీసుకోవడం వల్ల బరువు తగ్గి, చక్కటి ఫిట్‌నెస్ సాధిస్తారు. ఒక వంద గ్రాముల పెరుగులో 98 కేలరీలు, 3.4 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 4.3 గ్రాముల కొవ్వు, 11 గ్రాముల ప్రొటీన్, 364 మిల్లీగ్రాముల సోడియం, 104 మిల్లీగ్రాముల పొటాషియంలతో పాటు కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఏ, విటమిన్ డీ, విటమిన్ బీ-12 ఉంటాయి.పెరుగు తినడం వల్ల ప్రయోజనాలు:బరువు తగ్గడానికి : బరువు తగ్గాలనుకునేవారు పెరుగును తమ డైట్‌లో చేర్చుకోవడం చాలా బెటర్. దీంట్లో శరీర బరువును నియంత్రణలో ఉంచడానికి సరిపడే మోతాదులో కాల్షియం ఉండటమే కాకుండా ఒబెసిటీ రాకుండా చేస్తుంది.ఎముకల బలానికి! : పెరుగులో ఉండే కాల్షియం, పాస్పరస్‌లు ఎముకల బలానికి ఉపయోగపడతాయి. పళ్లు, ఎముకల బలంగా ఉండేందుకు కచ్చితంగా అవసరమైన కాల్షియం పెరుగు నుంచి దొరుకుతుంది. రోగ నిరోధక వ్యవస్థ కోసం! : మానవ శరీరానికి కచ్చితంగా అవసరమైన బెస్ట్ ప్రోబయోటిక్ ఫుడ్స్‌లో ఒకటి పెరుగు. శరీరానికి సరిపడా శక్తి, సామర్థ్యాన్ని పెంచి మెటబాలిజాన్ని మెరుగు చేస్తుంది. ఫలితంగా ఇమ్యూనిటీ పవర్ (రోగ నిరోధక శక్తి) పెరుగుతుంది.కాంతివంతమైన చర్మం కోసం! : చర్మ సంరక్షణకు పెరుగు బాగా ఉపయోగపడుతుంది. చర్మానికి పోషకాలను అందించి కాంతి వంతంగా, ఆరోగ్యవంతంగా మారుస్తుంది. ఇందు లో ఉండే విటమిన్ ఈ, జింక్ చర్మాన్ని సహజంగానే కాపాడుతాయి.కేశారోగ్యం కోసం! : డల్ హెయిర్, డ్రై హెయిర్, డాండ్రఫ్‌తో కూడిన హెయిర్ ఉన్న వాళ్లకు పెరుగు మంచి మందు. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ జుట్టు కుదుళ్లకు న్యూట్రియంట్లు, మినరల్స్ అందించి డాండ్రఫ్‌ను అరికడుతుంది. పెరుగు హెయిర్ కండీషనర్‌గా కూడా ఉపయోగపడుతుంది. హెన్నాతో కలిపి తలకు పెట్టుకోవడం వల్ల జుట్లు రాలడం తగ్గుతుంది.