- Advertisement -
– బండి సంజయ్‌పై చామల ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తాను కేంద్ర మంత్రినన్న సోయి కూడా బండి సంజయ్‌కుమార్‌కు లేకుండా పోయిందని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఇంకా ఓ కార్పొరేటర్ స్థాయి నాయకుని తరహాలో ఆలోచిస్తున్నారని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఓటు చోరీ గురించి మాట్లాడితే దానిపై ఆయన అర్థం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఓట్ చోరీపై అగ్రనేత రాహుల్‌గాంధీ వివరంగా ప్రజల కు వివరిం చారని గుర్తు చేశారు. ఒకే ఇంటిలో వంద ఓట్లు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. ఓటు చోరీపై సుప్రీంకోర్టు ఏం చెప్పిందో ఇప్పటికైనా గుర్తుకు తెచ్చుకోవాలని ఆయన హితవు పలికారు.
- Advertisement -