Sunday, February 1, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంగాజాపై మళ్లీ ఇజ్రాయిల్‌ ఘాతుకం

గాజాపై మళ్లీ ఇజ్రాయిల్‌ ఘాతుకం

- Advertisement -

– ఆరుగురు చిన్నారులు సహా 31 మంది మృతి
గాజా :
ఇజ్రాయిల్‌ మరో ఘాతుకానికి పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి గాజాపై తాజాగా ఇజ్రాయిల్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో ఆరుగురు చిన్నారు లుసహా 31 మంది ప్రాణాలు కోల్పో యారు. కాల్పుల విరమణ అమలులోకి వచ్చిన తరువా త ఇప్పటివరకూ 509 మందిని ఇజ్రాయిల్‌ బలిగొనడం గమనార్హం. శనివారం తెల్లవారు జామున గాజా సిటీ, ఖాన్‌యూ నస్‌ నగరాలపై ఇజ్రాయిల్‌ సైన్యం బాంబు దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో మొత్తంగా 31మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు వైద్య వర్గాలు మీడియాకు వెల్లడించాయి. గాజా సిటీలోని షేక్‌ రద్వాన్‌ పరిసరాల్లో గల పోలీసు ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని శనివారం తెల్లవారుజామున జరిగిన బాంబు దాడిలో ఏడుగురు మరణించినట్లు అల్‌షిఫా ఆసుపత్రి వర్గాలు మీడియాకు తెలిపాయి. పోలీసు కార్యాలయం శిధిలాల నుండి మృతదేహాలను సహాయ కార్యకర్తలు వెలికితీస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుందని భావిస్తున్నారు. మరోవైపు సెంట్రల్‌ గాజాలో ఐదుగురు, దక్షిణ గాజాలోని అల్‌- మవాసి ప్రాంతంలో ఏడుగురు మృతి చెందినట్లు మీడియా తెలిపింది.

రఫా క్రాసింగ్‌ తెరవడానికి ముందే హింసాత్మక దాడులు
ఈజిప్ట్‌తో గాజాను కలిపే రఫా క్రాసింగ్‌ను తిరిగి తెరవడానికి ఒక రోజు ముందుగా ఈ హింసాత్మక దాడులు చోటు చేసుకున్నాయి. అక్టోబరు 10న గాజాలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు జరిగిన కాల్పుల్లో 509మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని, 1405 మంది గాయపడ్డారని గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయం వెల్లడించింది. గతేడాది అక్టోబరు నుండి ఇప్పటివరకు 1300సార్లు ఇజ్రాయిల్‌ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడింది. నివాస సముదాయాలపై కూడా దాడులు ఎక్కువగా జరిగాయని తెలిపింది. దాదాపు 200సార్లు ప్రజల ఆస్తులపై దాడులు చేసి, ధ్వంసం చేశారని వెల్లడించింది. గత నెల రోజుల కాలంలో 50మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -