Thursday, October 9, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంసహాయ సామగ్రిని అడ్డుకుంటున్న ఇజ్రాయిల్‌

సహాయ సామగ్రిని అడ్డుకుంటున్న ఇజ్రాయిల్‌

- Advertisement -

గాజా : సహాయ సామగ్రితో గాజా వెళుతున్న పలు నౌకలను ఇజ్రాయిల్‌ సైన్యం అడ్డుకుంది. 93 మందితో కూడిన తమ సహాయ బృందంలో పాత్రికేయులు, వైద్యులు, కార్యకర్తలు ఉన్నారని, వారిని ఇజ్రాయిల్‌ సైనికులు అడ్డుకొని నిర్బంధించారని ఫ్రీడమ్‌ ఫ్లోటిల్లా కొయలేషన్‌ (ఎఫ్‌ఎఫ్‌సీ) తెలిపింది. పాలస్తీనా అనుకూల గ్రూపులతో ఏర్పడిన ఈ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలోనే గాజాకు సహాయ సామగ్రిని పంపుతున్నారు. ఇజ్రాయిల్‌ సైనికులు మూడు చిన్న చిన్న పడవలను కూడా బుధవారం అటకాయించారని ఆ సంస్థ చెప్పింది.

ఓడపై దాడి జరిగిన విషయాన్ని ఇజ్రాయిల్‌ విదేశాంగ శాఖ ధృవీకరించింది. నౌకలను, అందులో ఉన్న వారిని ఇజ్రాయిల్‌ ఓడరేవులో ఉంచామని, వారందరూ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని తెలిపింది. వారిని త్వరలోనే తిప్పిపంపుతామని పేర్కొంది. ఇజ్రాయిల్‌ చర్యను మలేసియా తీవ్రంగా ఖండించింది. ఓడలో ఉన్న తమ దేశీయులను విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. ఓడలో తమ దేశానికి చెందిన పౌరులు, ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారని టర్కీ చెప్పింది. ఇజ్రాయిల్‌ చర్యలు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -