Tuesday, July 1, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంగ్రెటా థన్‌బర్గ్‌ను స్వదేశానికి పంపించిన ఇజ్రాయిల్

గ్రెటా థన్‌బర్గ్‌ను స్వదేశానికి పంపించిన ఇజ్రాయిల్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: స్వీడిష్‌ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌ సహా 12 మందిని ఇజ్రాయిల్ సైన్యం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆమెను దేశం నుంచి వెనక్కి పంపినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గ్రెటాను ఫ్రాన్స్‌కు పంపిస్తున్నామని, అక్కడి నుంచి స్వీడన్‌కు వెళ్తుందని పేర్కొంటూ..ఇజ్రాయెల్ విదేశాంగశాఖ ఆమె ఫొటోను ఎక్స్‌లో పోస్టు చేసింది. ఆంక్షలను ఉల్లంఘించి తమ సముద్ర జలాల్లో ప్రవేశించినందుకు గాను ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. గ్రెటా, మరో ఇద్దరు కార్యకర్తలు, ఓ జర్నలిస్టు ఇజ్రాయెల్‌ను విడిచివెళ్లడానికి అంగీకరించడంతో వారిని ఫ్రాన్స్‌కు పంపించామని ఇజ్రాయెల్‌లోని లీగల్‌ రైట్స్‌ గ్రూప్‌ అదాలా పేర్కొంది. ఇతర కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లడానికి నిరాకరించడంతో వారిని నిర్బంధంలో ఉంచి..అధికారులు విచారిస్తున్నారని తెలిపింది.

పాలస్తీనాకు అనుకూలంగా గ్రెటా థన్‌బర్గ్‌ ఒక స్వచ్ఛంద సంస్థ ఫ్రీడమ్‌ ఫ్లొటిల్లా అలెయన్స్‌ను స్థాపించింది. యూరోపియన్ పార్లమెంట్ మెంబర్ రీమా హసన్‌తో కలిసి మొత్తం 12 మందితో కూడిన బృందం మడ్లీన్ నౌకలో గాజాకు బయల్దేరారు. వివిధమైన ఆహార వస్తువులు తీసుకుని బయల్దేరారు. అయితే సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌ ఆర్మీ అంతర్జాతీయ జలాల్లో నౌకను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో తమను ఐడీఎఫ్ కిడ్నాప్ చేసిందంటూ థన్‌బర్గ్ ఆరోపించింది.సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌ ఆర్మీ అంత్జాతీయ జలాల్లో వీరిని అడ్డుకుంది. అనంతరం నౌకను ఇజ్రాయెల్‌ పోర్టుకు మళ్లించాయి.

2023, అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి బందీలుగా తీసుకెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్.. హమాస్ అంతమే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇప్పటికే గాజా నాశనం అయింది. అయితే చాలా నెలలుగా గాజా సరిహద్దులు మూసేయడంతో ఆహార పదార్థాలు లభించక ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో అంతర్జాతీయంగా ఒత్తిడి రావడంతో రెండు వారాలుగా గాజా సరిహద్దులను ఇజ్రాయెల్ తెరిచింది. దీంతో స్వచ్ఛంద సంస్థలు ఆహారం పంపిణీ చేస్తున్నాయి. ఆ విధంగానే థన్‌బర్గ్ బృందం బయల్దేరింది. అయితే ఆమె పాలస్తీనా అనుకూలంగా ఉండడంతో అడ్డుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -