Tuesday, June 17, 2025
E-PAPER
Homeజాతీయంనదిలో మునిగిపోయిన 8 మంది యువకులు మృతి

నదిలో మునిగిపోయిన 8 మంది యువకులు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: స్నానానికి వెళ్లి నదిలో 8 మంది యువకులు మునిగిపోయారు. ఈ విషాద సంఘటన రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలోని బనాస్ నదిలో చోటు చేసుకుంది. 11 మంది యువకులు నదిలో స్నానం చేస్తుండగా లోతు ఎక్కువగా ఉండటం కారణంగా.. ఎనిమిది మంది నీటిలో కొట్టుకొనిపోయారు. వారిలో 8 మంది మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు. జైపూర్‌కు చెందిన 11 మంది యువకులు టోంక్ జిల్లాలోని బనాస్ నదిలో స్నానం చేయడానికి వెళ్లారు. నదిలో ఒక్కసారిగా ఉప్పెన రావడంతో లోతైన ప్రాంతంలోకి వెళ్లడం వల్ల వారు మునిగిపోయారు. స్థానికులు, పోలీసులు వెంటనే రక్షణ చర్యలు చేపట్టారు. వారిలోని 8 మందిని యువకులను రక్షించి ఆస్పత్రికి తరలించారు. అయితే వారిలో ఎనిమిది మంది మరణించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -