Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంగ్రెటా థన్‌బర్గ్‌ నేతృత్వంలోని'మానవత' నౌకను అడ్డుకుంటాం : ఇజ్రాయిల్‌

గ్రెటా థన్‌బర్గ్‌ నేతృత్వంలోని’మానవత’ నౌకను అడ్డుకుంటాం : ఇజ్రాయిల్‌

- Advertisement -

టెల్‌ అవీవ్‌ : ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ నేతృత్వంలో పాలస్తీనా వాసులకు మానవతా సహాయం అందించేందుకు వస్తున్న నౌకను అడ్డుకుంటామని ఇజ్రాయిల్‌ రక్షణమంత్రి ఇజ్రాయిల్‌ కాట్జ్‌ ఆదివారం ప్రకటించారు. ఇజ్రాయిల్‌ అమానుష దాడులతో పాలస్తీనాలో నెలకొన్న మానవతా సంక్షోభంపై ప్రపంచానికి అవగాహన కల్పించడం, ఇజ్రాయిల్‌ సముద్ర దిగ్బంధనాన్ని ఛేదించి మానవతా సహాయం అందించడం లక్ష్యంగా ఈ నౌక గాజా బయల్దేరింది. గ్రెటాతోపాటు పాలస్తీనా సంతతికి చెందిన ఫ్రెంచ్‌ యూరోపియన్‌ పార్లమెంట్‌ సభ్యురాలు రీమా హసన్‌సహా 12మంది కార్యకర్తలు ఫ్రీడమ్‌ ఫ్లోటిల్లా ఆధ్వర్యాన ఈ నెల 1న ఇటాలియన్‌ ఓడరేవు కాటానియా నుంచి మాడ్లీన్‌ నౌకలో బయల్దేరారు. ఆదివారం నాటికి గాజా ప్రాదేశిక జలాల్లోకి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తమ దాడులను వ్యతిరేకిస్తున్నందున ఇప్పటికే ఇజ్రాయిల్‌ రీమా హసన్‌ను బహిష్కరించింది. గత నెలలో ఫ్రీడమ్‌ ఫ్లోటిల్లా ఆధ్వర్యాన సహాయం అందించేందుకు వస్తున్న నౌకపై రెండు డ్రోన్లు దాడి చేయడంతో ఆ ఓడ ముందు భాగం దెబ్బతింది. ఇజ్రాయిల్‌ దాడి చేసినట్టు అప్పట్లో ఉద్యమకారుల బృందం విమర్శించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad