Friday, February 27, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంజర్నలిస్టుల హత్యల్లో ఇజ్రాయిల్‌ అగ్రస్థానం

జర్నలిస్టుల హత్యల్లో ఇజ్రాయిల్‌ అగ్రస్థానం

- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా మరణించిన 129 మందిలో 84 మంది ఇక్కడే హతం : సీపీజే నివేదిక వెల్లడి

జెనీవా: 2025లో ప్రపంచవ్యాప్తంగా హత్యకు గురైన జర్నలిస్టులలో అత్యధికులు ఇజ్రాయిల్‌లోనే మరణించారని ‘కమిటీ టు ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్స్‌ (సీపీజే) వార్షిక నివేదిక వెల్లడించింది. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా హత్యకు గురైన 129 మంది జర్నలిస్టులలో 84 మందిని ఇజ్రాయిల్‌లోనే చంపారని తెలిపింది. 1992లో సీపీజే డేటాను సేకరించడం ప్రారంభించినప్పటి నుంచి ఇవే అత్యధిక హత్యలు. మరణించిన వారిలో ఎక్కువ మంది పాలస్తీనా జర్నలిస్టులు. యెమెన్‌లోని వార్తా పత్రిక కార్యాలయాలపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడుల్లో 31 మంది మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా 47 మంది జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకున్న హత్యలలో 38 హత్యలు ఇజ్రాయిల్‌ చేసిందేనని సీపీజే తెలిపింది.

గాజా యుద్ధం, మీడియాపై విధించిన ఆంక్షల కారణంగా ఇజ్రాయిల్‌ చంపిన వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశముంది. మానిటరింగ్‌ వెబ్‌సైట్‌ Shireen.ps అంచనా ప్రకారం, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయిల్‌ దాదాపు 300 మంది జర్నలిస్టులను చంపింది. గాజా, యెమెన్‌లతో పాటు, అంతర్యుద్ధంతో బాధపడుతున్న సూడాన్‌లో, క్రిమినల్‌ ముఠాలు చురుకుగా ఉన్న మెక్సికోలో 2025 మందికిపైగా జర్న లిస్టులు చంపబడ్డారు. సూడా న్‌లో తొమ్మిది మంది, మెక్సికోలో ఆరుగురు మరణించారు. రష్యా సైనిక దాడుల్లో నలుగురు ఉక్రెయిన్‌ జర్నలిస్టులు కూడా మరణించారని నివేదిక పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -