టెహ్రాన్ : ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని గాంధీ ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకుని సోమవారం ఇజ్రాయిల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. ఈ దాడిలో ఆసత్ర్రి భవనం చాలా దెబ్బతిన్నట్టు తెలిపింది. ఈ దాడుల్లో జరిగిన ప్రాణనష్టం గురించి వెల్లడించలేదు. అయితే రోగులను అక్కడ్నించి తరలించినట్టు తెలిపింది. ఇరాన్ వార్తా సంస్థ ఐఎస్‌ఎన్‌ఎ కూడా ఈ దాడులను ధ్రువీకరించిం ది. మీడియా సంస్థలు ఈ దాడులకు సంబంధించిన వీడియో దృశ్యాలను కూడా విడుదల చేశాయి.
ఈ వీడియోలో వీల్‌చైర్ల వద్ద ఆసుపత్రి భవనం శిథిలాలు పడి ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ దాడులను ‘జియోనిస్టు- అమెరికన్ వైమానిక దాడులు’గా ఐఎస్‌ఎన్‌ఎ విమర్శించింది. శనివారం రాత్రి అమెరికా, ఇజ్రాయిల్ చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ మరణించిన ఒక రోజు తరువాత ఈ దాడులు జరిగాయి. ఇరాన్‌పై దాడులను కొనసాగిస్తున్నట్టు ఇజ్రాయిల్ కూడా ప్రకటించింది. రాజధానితో పాటు ఇతర ప్రాంతాలపై ఈ దాడులు జరుగుతున్నట్టు తెలిపింది.
టెహ్రాన్‌లోని గాంధీ ఆస్పత్రిపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



