- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దక్షిణ లెబనాన్‌లోని పాలస్తీనా శరణార్థి శిబిరం సమీపంలో ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో 13 మంది మరణించగా, నలుగురు గాయపడినట్లు లెబనాన్ ప్రకటించింది. ఐన్ ఎల్-హిల్వే ప్రాంతంలో ఆయుధాలతో ఉన్న హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అయితే అక్కడ ఎలాంటి సాయుధ బలగాలు లేవని లెబనాన్ పేర్కొంది. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత జరిగిన అతి పెద్ద దాడిగా తెలుస్తోంది.
- Advertisement -



