గాజాలో 34 మంది మృతి
ఐక్యరాజ్యసమితిలో చర్చ జరుగుతున్నదశలో ఆగని దమనకాండ
గాజా: ఓవైపు ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయిల్ దాష్టీకానికి వ్యతిరేకంగా గళమెత్తితే..మరోవైపు ఇజ్రాయిల్ మంగళవారం దాడులు తీవ్రతరం చేసింది.గాజా నగరంపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు విధ్వంసం సృష్టించాయి. నగరానికి దక్షిణాన భూ బలగాలు ముందుకు దూసుకెళ్తూ..బాంబుల వర్షం కురిపించటంతో.. 34 మంది పాలస్తీనియన్లు మరణించారు.2023 అక్టోబర్ నుంచి ఇజ్రాయిల్ గాజాపై చేసిన యుద్ధంలో కనీసం 65,382 మంది మరణించగా, 166,985 మంది గాయపడ్డారు. వేలాది మంది శిథిలాల కింద సమాధి అయి ఉంటారని భావిస్తున్నారు. అక్టోబర్ 7న జరిగిన దాడులలో ఇజ్రాయిల్‌లో మొత్తం 1,139 మంది మరణించారు . దాదాపు 200 మందిని బందీలుగా తీసుకెళ్లారు.