Thursday, May 29, 2025
Homeఅంతర్జాతీయంగాజాపై ఇజ్రాయిల్‌ దాడులు

గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు

- Advertisement -

– 52 మంది మృతి
గాజాస్ట్రిప్‌:
పాలస్తీనీయులపై ఇజ్రాయిల్‌ పాశవిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయిల్‌ సైన్యం చేసిన దాడుల్లో 52 మంది మరణించారు. వీరిలో 36 మంది పునరావాస శిబిరంలో తలదాచుకుంటున్న వారే. నిద్రలో ఉండగానే వీరంతా ఇజ్రాయిల్‌ దాడుల్లో కన్నుమూశారు. గాజా నగరంలో దరాజ్‌లోని పాఠశాలపై జరిగిన దాడిలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ఏడాది మార్చి నుంచి ఇజ్రాయిల్‌ తన దాడులను మరింత ఉధృతం చేసిన సంగతి తెలిసిందే. అలాగే దాదాపు 3 మూడు నెలలుగా గాజాలోకి ఆహారం, మందులు, ఇంధనం.. వంటి అనేక ఇతర వస్తువులు ప్రవేశించకుండా అడ్డుకున్న ఇజ్రాయిల్‌ ఇటీవలే వాటి రవాణాకు అనుమతించింది. అంతర్జాతీయ సంస్థలు, సహాయ బృందాలు గాజాలో కరువు గురించి హెచ్చరించడంతో ఇజ్రాయిల్‌ తప్పనిసరిగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే గాజాలోకి వస్తున్న ఈ సహాయం ఇక్కడి అవసరాలకు సరిపోదని సంస్థలు చెబుతున్నాయి. కాగా, గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకుని, ఇక్కడ ఉన్న 2 మిలియన్లకు పైగా ప్రజల్ని బలవంతంగా వలస వెళ్లేవిధంగా చేసే ఉద్దేశంతోనే ఇజ్రాయిల్‌ దాడులను కొనసాగిస్తుంది. ఇప్పటికే గాజాలోని అనేక ప్రాంతాలను ఇజ్రాయిల్‌ నాశనం చేసింది. దాదాపు 90 శాతం ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇజ్రాయిల్‌ దాడుల్లో ఇప్పటి వరకూ 54వేల మంది పాలస్తీనీయులు మరణించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -