నవతెలంగాణ-హైదరాబాద్: లెబనాన్‌పై తాజాగా మరోసారి ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. హిజ్బుల్ స్థావరాలే లక్ష్యంగా చేసుకుని ఐడీఎఫ్ దళాలు దాడులు చేస్తున్నాయి. ప్రస్తుతం లెబనాన్‌లో బాంబుల మోత మోగుతోంది. మంగళవారం లెబనాన్‌లోని దక్షిణ నగరమైన టైర్‌పై ఇజ్రాయెల్ రెండు వైమానిక దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ సైన్యం టైర్, సిడాన్‌లను దాడులకు బెదిరిస్తూ..వెంటనే ఖాళీ చేసి కనీసం 300 మీటర్లు దూరం వెళ్లాలని” నివాసితులను కోరుతూ ఒక ప్రకటన విడుదల చేసిన కొద్దిసేపటికే ఈ దాడి జరిగింది.
గత నెల 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యాడు. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది. ఇరాన్‌కు మద్దతుగా లెబనాన్ కూడా ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది. దీంతో అప్పటి నుంచి ఒకేసారి ఇరాన్, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ప్రస్తుతం భీకర యుద్ధం సాగుతోంది.



