Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంపాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులను ఆపాలి

పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులను ఆపాలి

- Advertisement -

డీవైఎఫ్‌ఐ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ చేస్తున్నదాడులను వెంటనే ఆపాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) డిమాండ్‌ చేసింది. బుధవారం హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ వద్ద పాలస్తీనాకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్‌, ఆనగంటి వెంకటేష్‌ మాట్లాడుతూ 20 నెలలకుపైగా గాజాపై ఇజ్రాయిల్‌ చేస్తున్న దాడుల్లో 55 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని చెప్పారు. వారిలో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఆస్పత్రులు, పాఠశాలలు, శరణార్ధుల కేంద్రాలతో సహా కీలకమైన మౌలిక వసతులన్నింటినీ ఉద్దేశ్యపూర్వకంగా నాశనం చేస్తున్నదని విమర్శించారు. భారత ప్రభుత్వం ఇజ్రాయిల్‌ పట్ల మెతక వైఖరిని అవలంబిస్తున్నదని అన్నారు. భారతదేశం పాలస్తీనా ప్రజలకు సంఘీభావం ప్రకటించి, ఇజ్రాయెల్‌కు సైనిక, భద్రతా సహకారాన్ని తక్షణమే నిలిపేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జావీద్‌, నాయకులు అస్మిత, రాజయ్య, మహేష్‌, ప్రవీణ్‌, శ్రావణి పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad