Tuesday, May 20, 2025
Homeఅంతర్జాతీయంగాజాపై ఇజ్రాయెల్ మిలటరీ ఎటాక్…60 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ మిలటరీ ఎటాక్…60 మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య 2023, ఆక్టోబర్ నెల నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం కారణంగా గాజాలో 53 వేలకు పైగా సైన్యం, ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘర్షణలో భాగంగా గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ రెండు రోజుల కింద విరుచుకుపడింది. ఈ దాడుల్లో కనీసం 66 మంది మరణించారని, 100 మందికి పైగా గాయపడ్డారని గాజాలోని ఆసుపత్రులు, వైద్య సిబ్బంది తెలిపారు. ఈ దాడిని మరవక ముందే మరోసారి గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడ్డారు. హమాస్ ఆధీనంలో ఉన్న బందీలను విడిపించుకోవడమే లక్ష్యంగా చేసుకొని గాజాపై ఇజ్రాయెల్ మిలటరీ యాక్షన్ ను తీవ్రతరం చేసింది. మంగళవారం ఉదయం నుంచి కొనసాగిన ఈ దాడిలో 60 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఇందులో అత్యధికంగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ దాడులు ఉత్తర గాజాలోని ఓ ఇల్లు, పునరావాస కేంద్రంలోపై జరిగినట్లు స్థానిక అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తమ డిమాండ్లకు హమాస్ ఒప్పుకుంటే యుద్ధం ఆపేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు నిన్న సాయంత్రం ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -