Friday, December 26, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయిల్‌ చర్య చట్టవిరుద్ధం

ఇజ్రాయిల్‌ చర్య చట్టవిరుద్ధం

- Advertisement -

సెటిల్మెంట్ల విస్తరణపై మండిపడిన యూరోపియన్‌ దేశాలు, కెనడా

వెస్ట్‌బ్యాంక్‌ : ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌ సెటిల్మెంట్లను విస్తరించేందుకు ఇజ్రాయిల్‌ పన్నుతున్న ఎత్తుగడలను 14 దేశాలు తీవ్రంగా ఖండించాయి. పాలస్తీనియన్లకు మద్దతును పునరుద్ఘాటించాయి. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో కొత్తగా 19 సెటిల్మెంట్లను చేర్చేందుకు ఇజ్రాయిల్‌ ఆమోదం తెలిపింది. ఈ చర్యను బ్రిటన్‌, కెనడా, డెన్మార్క్‌ సహా పలు దేశాలు తప్పుపట్టాయి. ఇజ్రాయిల్‌ చర్య చట్టవిరుద్ధమని, గాజా కాల్పుల విరమణకు, ఆ ప్రాంతంలో దీర్ఘకాలిక శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని మండిపడ్డాయి. ఇజ్రాయిల్‌ చర్యలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని, గాజా ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి.

‘ఇజ్రాయిల్‌ భద్రతా క్యాబినెట్‌ నిర్ణయాన్ని బెల్జియం, కెనడా, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, ఐస్‌లాండ్‌, ఐర్లాండ్‌, జపాన్‌, మాల్టా, నెదర్లాండ్స్‌, నార్వే, స్పెయిన్‌, బ్రిటన్‌ దేశాలు ఖండిస్తున్నాయి’ అని ఆయా దేశాలు ఓ సంయుక్త ప్రకటన విడు దల చేశాయి. సెటిల్మెంట్‌ విధానాల విస్తరణ కోసం అవలంబించే ఏ ప్రణాళికనై నా తాము వ్యతిరేకిస్తామని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. నిర్ణయాన్ని ఉపసంహ రించుకోవాలని, సెటిల్మెంట్ల విస్తరణకు పాల్పడవద్దని ఇజ్రాయిల్‌ను కోరారు. పాలస్తీనియన్ల స్వీయ నిర్ణయాధికార హక్కుకు మద్దతు ఇస్తామని అంటూ రెండు దేశాల పరిష్కారం ఆధారంగా సమగ్రమైన, న్యాయసమ్మతమైన, దీర్ఘకాలిక శాంతి స్థాపనకు కట్టుబడి ఉంటామని తెలిపారు. కాగా 14 దేశాల సంయుక్త ప్రకటనపై ఇజ్రాయిల్‌ విమర్శలు కురిపించింది. ఇజ్రాయిల్‌లో నివసించేందుకు యూదులకు ఉన్న హక్కును విదేశాలు నియంత్రించలేవని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -