Sunday, December 21, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంగాజాలో ఆగని ఇజ్రాయిల్‌ మారణకాండ

గాజాలో ఆగని ఇజ్రాయిల్‌ మారణకాండ

- Advertisement -

70 వేల మందికి పైగా మృతి

గాజా : ఇజ్రాయిల్‌ మారణకాండ కొనసా గుతూనేవుంది. పాలస్తీనియన్లను లక్ష్యంగా చేసుకొని గాజా స్ట్రిప్‌లో అది సాగిస్తున్న అమానవీయ దాడుల్లో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య ఆదివారం నాటికి 7100 దాటింది. క్షతగాత్రుల సంఖ్య 170965కు పెరిగింది. అమెరికా మధ్యవర్తి త్వంతో శాంతి ఒప్పందం అనంతరం కూడా ఇజ్రాయిల్‌ దాడులు సాగిస్తోంది. ఆదివారం నాటికి గడిచిన 24 గంటల్లో ఇజ్రాయిల్‌ జరిపిన ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో శాంతి ఒప్పందం తర్వాతి దాడుల్లో మరణాల సంఖ్య 356కు చేరింది. వాస్తవానికి ఈ ఏడాది అక్టోబర్‌ 10న కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. కానీ ఇజ్రాయిల్‌ దాడులు మాత్రం కొనసాగుతూనేవున్నాయి. మరోవైపు గతంలో చేసిన దాడుల వల్ల శిథిలాల కింద చిక్కుకుపోయిన మతదేహాలు బయటకు తీస్తుండడంతో మరణిం చినవారి సంఖ్య మరింత పెరుగుతోంది. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటి వరకు 70,100 మంది పాలస్తీనీయన్లు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తరువాత నుంచి లెక్కవేస్తే మొత్తం 352 మంది మరణించినట్లు గాజా ఆరోగ్యశాఖ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -