Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయండీఎస్సీ నోటిఫికేషన్‌ జారీచేయండి

డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీచేయండి

- Advertisement -
  • సీఎం రేవంత్‌రెడ్డికి పోస్టు కార్డులు రాసిన అభ్యర్థులు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేయాలని డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వారు బుధవారం పోస్టు కార్డులు రాశారు. పదోన్నతులు, ఉద్యోగ విరమణ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలు ఏర్పడ్డాయని తెలిపారు. వాటి భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రకటించాలని కోరారు. గత డీఎస్సీ తర్వాత ఇప్పటికే రెండు సార్లు టెట్‌ పరీక్షలు జరిగాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం నేతలు హరీశ్‌, వీరబాబు, సునీల్‌, భాషా, రఘు, కిరణ్మయి, రచన, కవిత, మేఘన, రజిత, శ్రీలత, వాణి, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad