Monday, March 23, 2026
E-PAPER
Homeజిల్లాలుప్రజావాణిలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ప్రజావాణిలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి

- Advertisement -

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్‌: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. సోమవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డితో కలిసి వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 52 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.

అందులో రెవిన్యూ శాఖ 39, డివిజనల్ పంచాయతీ 5 జిల్లా మేనేజర్ సివిల్ సప్లై, జిల్లా గ్రామీణ అభివృద్ధి, ఎంప్లాయిమెంట్, సివిల్ కోర్టు, లీగల్ సర్వీస్ అథారిటీ, జిల్లా మార్కెటింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యూనిట్ వన్,ఈ ఈ పంచాయతీ రాజ్ శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జెడ్పీ సిఈఓ శోభ రాణి, డిఆర్‌డిఓటి నాగిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -