Sunday, May 11, 2025
Homeజాతీయంరూ.70 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఐటీ కమీషనర్..

రూ.70 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఐటీ కమీషనర్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఓ ప్రముఖ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు ఏకంగా రూ.70 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఆదాయపన్ను శాఖ కమిషనర్ లావుడ్యా జీవన్ లాల్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఆయనతో పాటు మరో నలుగురిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కుమారుడైన జీవన్ లాల్ 2004 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన ఆదాయపన్ను శాఖ కమిషనర్‌ హోదాలో పని చేస్తున్నారు. ఆదాయపన్ను ఎగవేతదారులను పట్టుకుని వారి నుంచి పన్ను కట్టించాల్సిన ఉన్నతాధికారే మధ్యవర్తుల ద్వారా భారీ ఎత్తున లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు పట్టుబడటం ఆదాయపన్ను శాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఐటీ అప్పీల్ యూనిట్ 7,8కి ఇన్ ఛార్జి కమిషనర్‌గా వ్యవహరిస్తున్న జీవన్ లాల్, ఐటీ అప్పీళ్లను పరిష్కరించేందుకు కొందరు మధ్యవర్తుల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయనపై ఫిర్యాదులు అందడంతో సీబీఐ రంగంలోకి దిగింది. ముంబయిలో శుక్రవారం షాపూర్ జీ పల్లోంజీ గ్రూపు ప్రతినిధుల నుంచి జీవన్ లాల్‌కు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వ్యక్తి రూ.70 లక్షలు లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -