నవతెలంగాణ-హైదరాబాద్: ఆఫీసులో మీటింగ్ జరుగుతుండగా …. మధ్యలో లేచి వెళ్లిన ఐటి ఉద్యోగి భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. నాసిక్‌కు చెందిన పీయూష్ అశోక్ కవాడే (23) పుణెలోని హింజెవాడి ఐటీ పార్క్‌లోని ఓ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గతేడాది జులైలోనే ఈ కంపెనీలో చేరాడు. రోజూలాగే సోమవారం ఉదయం ఆఫీసుకు వచ్చిన అతడు కంపెనీ మీటింగ్‌కు హాజరయ్యాడు. మధ్యలో ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పి మీటింగ్ నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత కొన్ని క్షణాలకే బిల్డింగ్ ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తోటి ఉద్యోగులంతా ఉలిక్కిపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. చనిపోవడానికి ముందు పీయూష్ తన తండ్రికి ఓ మెసేజ్ పెట్టినట్లు గుర్తించారు. ”నేను జీవితంలో ప్రతిచోటా ఓడిపోయాను. మీ కొడుకుగా ఉండటానికి నేను అనర్హుడిని. నన్ను క్షమించండి ” అంటూ పీయూష్ వాళ్ల నాన్నకు పంపిన సందేశంలో పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ పాండ్రే తెలిపారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను గుర్తించేందుకు దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.
ఆఫీస్ భవనంపై నుంచి దూకి ఐటీ ఉద్యోగి ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES