Monday, January 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅలరిస్తూనే ఆలోచింపజేస్తుంది

అలరిస్తూనే ఆలోచింపజేస్తుంది

- Advertisement -

త్రిగుణ్‌, పాయల్‌ రాధాకృష్ణ, అనీష్‌ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ వర్క్‌ ఫ్రమ్‌ హౌమ్‌’. మధుదీప్‌ చెలికాని రచన, దర్శకత్వం వహించారు. సిహెచ్‌.వి.ఎస్‌.ఎన్‌.బాబ్జీ సమర్పణలో లోటస్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌ పై అరవింద్‌ మండెం నిర్మించారు. ఈ చిత్ర టీజర్‌ గ్రాండ్‌గా లాంచ్‌ చేశారు. హీరో త్రిగుణ్‌ మాట్లాడుతూ,’ మోడరన్‌ లైఫ్‌, పాత పద్ధతిలో ఉన్న వ్యవసాయాన్ని ఎలా కలపొచ్చు అనేది ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించారు.మనమందరం కూడా వ్యవసాయం నుంచే వచ్చాం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని తరాలు కూడా వ్యవసాయం నుంచే వచ్చాయి. వ్యవసాయం గురించి ఇంపార్టెంట్‌ విషయాలు మాట్లాడుతూనే సినిమా చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్‌ చేస్తాం’ అని అన్నారు.

‘వ్యవసాయం చేసే విధానంలో మార్పు రావాలి.. ఈ ఆలోచనతో చేసిన కథ. చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ హత్తు కునేలా వుంటుంది. బాబ్జి చాలా మంచి మనిషి. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎండ్‌ కార్డ్‌ వరకు మీ మొహంలో చిరునవ్వు ఎక్కడికి పోదు. ఈ సినిమా ఆనందంపజేస్తుంది, ఆలోచింపచేస్తుంది. సినిమా చూసిన తర్వాత అందరూ కూడా చిరునవ్వుతో బయటకు వస్తారు’ అని డైరెక్టర్‌ మధుదీప్‌ చెప్పారు. ప్రొడ్యూసర్‌ అరవింద్‌ మాట్లాడుతూ,’ఇది ఒక ఇంపార్టెంట్‌ కంటెంట్‌ ఉంటూనే హైలీ ఎంటర్‌టైనింగ్‌గా ఉండే సినిమా. అద్భుతమైన ఎంటర్టైన్మెంట్‌ ఉంటూనే మీనింగ్‌ ఫుల్‌ మెసేజ్‌ కూడా ఉంటుంది’ అని తెలిపారు. ‘సినిమా అద్భుతంగా వచ్చింది. ఇది మామూలు సినిమా కాదు. టీజర్‌ శాంపిల్‌ మాత్రమే. ట్రైలర్‌ అదిరిపోతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు అద్భుతంగా ఎంజాయ్ చేసే సినిమా ఇది’ అని సమర్పకుడు బాబ్జి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -