- Advertisement -
నవతెలంగాణ – మునుగోడు
శివ స్వాములకు అన్నప్రసాద వితరణ చేసేందుకు తమకు అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని మునుగోడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముచ్చపోతుల శ్రీనివాస్ గీతమ్మ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాచీన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శివ స్వాములకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో శివ స్వాములు , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -



