టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
సివిల్స్ ర్యాంకర్ గూడెం సృజన తల్లిదండ్రులు రాణి రాజేశంలకు సెంటినరీ కాలనీలోని (ఎస్టి2 1193) క్వార్టర్స్ లో వారి ఇంటికి వెళ్లి ఆదివారం టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు, రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ బి.జనక్ ప్రసాద్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ.. మంథని జేఎన్టీయు కళాశాలలో విద్యను అభ్యసించి సివిల్స్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో జాతీయస్థాయిలో గూడెం సృజన 55వ ర్యాంకు సాధించడం చాలా గొప్ప విషయమన్నారు.
మంథని నియోజకవర్గంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు విద్యకు పెద్దపీట వేస్తూ నియోజకవర్గంలో జూనియర్ కళాశాలలు, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. యువత సృజన ను ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పిలుపునిచ్చారు.



