Sunday, September 28, 2025
E-PAPER
Homeరాష్ట్రీయందేశంలో యూరియా కొరత లేదనడం అవగాహనా రాహిత్యం

దేశంలో యూరియా కొరత లేదనడం అవగాహనా రాహిత్యం

- Advertisement -

– బీజేపీ అధ్యక్షుడికి తుమ్మల లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

దేశంలోనూ, రాష్ట్రంలోనూ యూరియా కొరత లేదనడం బీజేపీ అధ్యక్షులు రామచందర్‌రావు అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇవిగో సాక్ష్యాలంటూ గురువారం మంత్రి ఆయనకు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వమే యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ‘రాష్ట్రానికి కేంద్రం ఎంత యూరియా కేటాయించింది. ఎంత సరఫరా చేసింది అనే వాస్తవాలను ముందుగా రామచందర్‌రావు తెలుసుకోవాలి’ అని సూచించారు. తెలంగాణ రాష్ట్రం లోనే కాదు…పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో కూడా యూరియా కొరత ఉందని పేర్కొన్నారు. బీజేపీది రైతు మిత్ర ప్రభుత్వం కాదనీ, రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆయన విమర్శించారు. యూరియాపై మాట్లాడేటప్పుడు అన్ని వివరాలను తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. ఆ తర్వాత సీబీఐ విచారణ వంటి ప్రగల్భాలు పలకాలని మంత్రి హితవు పలికారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -