Friday, August 29, 2025
E-PAPER
spot_img
HomeNewsన్యాయాన్ని ఎగతాళి చేయడమే..

న్యాయాన్ని ఎగతాళి చేయడమే..

- Advertisement -

– బెయిల్‌ ఆర్డర్‌ ఉన్నా ఖైదీని విడుదల చేయకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
– ఘజియాబాద్‌ జిల్లా జైలర్‌కు సమన్లు
న్యూఢిల్లీ:
దాదాపు రెండు నెలల క్రితమే బెయిల్‌ మంజారు చేసినా ఘజియాబాద్‌ జిల్లా జైలు నుంచి ఇప్పటి వరకూ కూడా ఖైదీని విడుదల చేయకపోవడంపై సుప్రీంకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది న్యాయాన్ని ఎగతాళి చేయడమేనని విమర్శించింది. ఘజియాబాద్‌ జిల్లా జైలు సూపరింటెండెంట్‌ జైలర్‌ తమ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని, ఉత్తరప్రదేశ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (జైళ్లు) తమ ముందు వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా హాజరుకావాలని జస్టిస్‌ కెవి విశ్వనాథన్‌, ఎస్‌కె సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పును తేలిగ్గా తీసుకోవద్దని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ కేసు పూర్తి వివరాల క్రితం ఉత్తరప్రదేశ్‌ చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ చట్టం 2021 కింద నమోదైన కేసులో ఒక వ్యక్తికి ఈ ఏడాది ఏప్రిల్‌ 29న బెయిల్‌ మంజారు చేశారు. అయితే బెయిల్‌ ఉత్తర్వుల్లో సదరు వ్యక్తిపై నమోదు చేసిన అభియోగం యొక్క నిబంధనలోని ఉప నిబంధనను ప్రస్తావించలేదు. ఈ కారణంతో జైలు అధికారులు అతన్ని విడుదల చేయడం లేదు. దీంతో బాధిత వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్‌ 29న ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులను సవరించాలని, తాజా ఉత్తర్వుల్లో మత మార్పిడి నిషేధ చట్టం 2021లోని సెక్షన్‌ 5లోని క్లాజ్‌ (1)ను ప్రత్యేకంగా చేర్చాలని కోరారు. దీన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad