- Advertisement -
నవతెలంగాణ-ఆమనగల్ : రాష్ట్ర క్యాబినెట్ లో భారత మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నాయకులు అజారుద్దీన్ కు అవకాశం కల్పించడం హర్షనీయమని కేఎన్ఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు మెకానిక్ బాబా శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. క్రికెట్ రంగానికి ఎనలేని సేవలు చేసి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్న అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో మైనార్టీలతోపాటు యువతలో సానుకూల వాతావరణ నెలకొంటుందని అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -

 
                                    