Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అవయవ దానం చేయడానికి కుటుంబం ముందుకు రావడం అభినందనీయం..

అవయవ దానం చేయడానికి కుటుంబం ముందుకు రావడం అభినందనీయం..

- Advertisement -

దానం చేసిన రాజేష్ కుటుంబాన్ని అభినందించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి..
నవతెలంగాణ – డిచ్ పల్లి

ఒక మనిషి చనిపోయిన తర్వాత  అవయవాలు దానం చేయడానికి వారి కుటుంబం ముందుకు రావడం ఎంతో కష్టంగా ఉన్న ఈ రోజుల్లో, రాజేష్ భార్య, తల్లిదండ్రులు మరి ఒక్కరి ప్రాణాలను కాపాడాలని అవయవాలు దానం చేయడానికి అంగీకరించినందుకు అభినందనీయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పేర్కొన్నారు. డిచ్ పల్లి మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన  బుర్ర రాజేష్ గౌడ్ మరణించిన అనంతరం అవయవాలు మరొకరికి దానం చేసిన అ కుటుంబాన్ని శనివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అభినందించారు.

ముందుగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి రాజేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులు అర్పించారు. శనివారం రోజు బుర్ర రాజేష్ గౌడ్  కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి అండగా ఉంటామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా సంస్మరణ సభలో మాట్లాడుతూ  ఈ రోజుల్లో  చాలామంది  బ్రెయిన్ డెడ్ వల్ల చనిపోతున్నారని, వారి కుటుంబ సభ్యులు అవయవాలు దానం చేయడానికి అంగీకరిస్తే, అతని వల్ల మరొక ప్రాణాన్ని కాపాడిన వారు అవుతారన్నారు.కండ్లు, కాలేయం, కిడ్నీలు,గుండె వంటి అవయవాలను దానం చేసి ఇతరులను కాపాడమే గోప్ప ధానం అన్నారు. ఎన్నో సంస్థలు అవయవ దానాలపై  అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోలసాని శ్రీనివాస్, సీనియర్ నాయకులు వాసు బాబు, ధర్మ గౌడ్, శ్యామ్ సన్, కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -